Begin typing your search above and press return to search.

ప‌న‌బాక రివ‌ర్స్ గేర్‌.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Nov 2020 5:07 PM GMT
ప‌న‌బాక రివ‌ర్స్ గేర్‌.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారా?
X
ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. టికెట్ల కోసం పోటీ ప‌డే నాయ‌కులు, ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటామంటూ.. బెదిరిం చే నాయ‌కులు కూడా మ‌న‌కు క‌నిపిస్తున్నారు. ఇక‌, టికెట్ల‌ను ద‌క్కించుకునేందుకు నాయ‌కులు వేసే ఎత్తులు.. పై ఎత్తులు కూడా అన్నీ ఇన్నీ కావు. అయితే, దీనికి భిన్నంగా కేంద్ర మాజీ మంత్రి టీడీపీలో ఉన్న ఎస్సీ సామా జిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు ప‌న‌బాక ల‌క్ష్మి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే సందేహాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. మ‌రో రెండు మాసాల్లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇంకా దీనికి సమ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ స్థానానికి ప‌న‌బాక‌ను ప్ర‌క‌టించేశారు.

ఇలా.. ఇంత వేగంగా.. ఇంకా నోటిఫికేషన్‌ రాకుండానే ప‌న‌బాక‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం వెనుక ఏదైనా వ్యూ హం ఉందా? అనే కోణంలో గ‌త వారం రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది లావుంటే.. మ‌రోవైపు.. త‌న‌కు అంద‌రిక‌న్నా ముందుగానే చంద్ర‌బాబు తిరుప‌తి బై ఎల‌క్ష‌న్ సీటు కేటాయించా ర‌నే సంతోషం ప‌న‌బాక‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. టికెట్ ప్ర‌క‌టించిన రోజు.. ఏదో.. చంద్ర‌బాబుకు ధ‌న్య‌వా దాలు చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌.. ఆమె క‌నీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఎలాంటి ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. దీంతో ఆమెకు అస‌లు ఏమైంది? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీకి తిరుప‌తిలో బ‌లం లేదు. పైగా మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌(తిరుప‌తి) వ్య‌తిరే క వ‌ర్గంగా మారిపోయింది. ఇక‌, మిగిలిన వారంతా వైసీపీకి అనుబంధంగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకు ని ముందుకు సాగుతున్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి ఇలా నే ఉంది. దీంతో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసినా.. గెలిచే అవ‌కాశం లేద‌ని ప‌న‌బాక ల‌క్ష్మి భావిస్తున్న‌ట్టు రాజ‌కీ య‌వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతుండ‌డం విశేషం. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఆమె టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డే పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు టికెట్ ముందుగానే ఖ‌రారు చేసినా.. తెలుగు దేశం పార్టీ గెలుపుపైన‌మ్మ‌కం లేక‌.. బీజేపీ వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం తిరుప‌తిలో జోరుగా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఏ క్ష‌ణాన ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టికెట్ ఖ‌రారు చేసిన త‌ర్వాత కూడా జంప్ చేస్తారా? అంటే.. ఔన‌నే ంఅంటున్నారు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. నెల్లూరు పార్ల‌మెంటు స్థానం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌ను పొందిన‌ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి నాలుగు గంట‌ల్లోనే పార్టీ మారిపోయి.. వైసీపీ గూటికి చేరిపోయిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు ప‌రిశీల‌కులు. సో.. ఇప్పుడు ప‌న‌బాక కూడా అలానే చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే వైసీపీ త‌ర‌ఫున ప‌న‌బాక‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు. సో.. పాలిటిక్స్‌లో ఏమైనా జ‌ర‌గొచ్చనే దానికి ల‌క్ష్మి ఉదాహ‌ర‌ణ కావ‌చ్చు!!