Begin typing your search above and press return to search.

పనబాక టీడీపీకీ పెద్ద హ్యాండిచ్చేట్లున్నారే

By:  Tupaki Desk   |   20 Jan 2021 3:57 PM GMT
పనబాక టీడీపీకీ పెద్ద హ్యాండిచ్చేట్లున్నారే
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల కేంద్ర కార్యాలయాన్ని టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నేతలంతా హాజరయ్యారు కానీ అభ్యర్ధి పనబాక లక్ష్మి మాత్ర ఎక్కడా కనబడలేదు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కింజరాపు రావటం పక్కకుపోయి చివరకు పనబాక గైర్హాజరే ప్రధాన చర్చయిపోయింది.

మొదటినుండి కూడా పనబాక వైఖరి అనుమానస్పదంగానే ఉంది. సహజ శైలికి విరుద్ధంగా పనబాకను అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల క్రితమే ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించారే కానీ పనబాక మాత్రం ఎక్కడ ఇంతవరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పోటీ చేస్తానని కానీ చేయననికానీ ఎక్కడా ఒక్క ప్రకటన కూడా లేదు. దాంతో అనుమానం వచ్చిన చంద్రబాబు సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డిని రంగంలోకి దింపారు.

వాళ్ళమధ్య ఏమి చర్చలు జరిగాయో తెలీదుకానీ కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రచారానికి దిగుతానని హామీఇచ్చారట. అయితే కూతురు పెళ్ళయిపోయి 15 రోజులైనా ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక చంద్రబాబుతో పాటు నేతలు కూడా తలలు పట్టుకున్నారు. సరే పార్టీ కార్యాలయం ప్రారంభిస్తే సరిపోతుంది అన్నీ సర్దుకుంటాయిలే అనుకున్నారు. ఎందుకంటే 21వ తేదీ నుండి పదిరోజుల పాటు నేతలు, శ్రేణులు ప్రచారం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు.

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పనబాకకు చెప్పినా ఆమె గైర్హాజరవ్వటం అందరినీ షాక్ కు గురిచేసింది. అచ్చెన్న వస్తారని తెలుసు, పార్టీ కార్యాలయం ప్రారంభించబోతున్నారనీ తెలుసు. పైగా సమాచారం ఉన్నా ఆమె హాజరుకాలేదంటే అసలు ఆమెకు పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అన్నదే అందరిలోను డౌటు పెరిగిపోతోంది. ఇపుడు గనుక పనబాక పోటీలో నుండి తప్పుకుంటే ..