Begin typing your search above and press return to search.

కొండేపి వైసీపీ ఇన్ చార్జి అంతటి ఘనుడట.. సంచలనంగా కరపత్రం

By:  Tupaki Desk   |   22 Feb 2023 9:50 AM GMT
కొండేపి వైసీపీ ఇన్ చార్జి అంతటి ఘనుడట.. సంచలనంగా కరపత్రం
X
ఆరాచక రాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఏపీలో నడుస్తున్న జగన్ సర్కారును చూపిస్తే సరిపోతుందన్న మాటలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ.. వైరల్ అవుతున్న వీడియోల్లోనూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వాదనకు బలం చేకూరేలా పలు ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తాజా సంచలనంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా.. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలోని కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న వరికూటి అశోక్ బాబు తీరుపై తాజాగా ఒక కరపత్రం విడుదలైంది.

ఇందులో అతడి ఘన కార్యాల్ని ప్రస్తవించటమే కాదు.. వివరంగా వివరించారు. ఆయన తీరు ఎలా ఉంటుందన్న విషయాల్ని కరపత్రంలో వివరంగా చెప్పుకొచ్చారు. పిడుగురాళ్ల.. జానపాడు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన.. తమ వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వటం లేదంటున్నారు రైతులు. తమ గోడును వెళ్లబోసుకోవటానికి వీలుగా తాజా కరపత్రం విడుదల చేసినట్లుగా అందులో పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున పోటీ చేస్తున్నానని.. కాబోయే ఎమ్మెల్యేను అని పేర్కొన్న ఆయన.. 'డబ్బులు అడగొద్దు.. డబ్బులు అడిగిన వారిని చంపుతా. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెడతా' అని బెదిరింపులకు దిగుతున్నట్లుగా పాంప్లేట్ లో పేర్కొన్నారు. 2010-18 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన అశోక్ బాబు..ఆర్థిక లావాదేవీల కోసం రైతుల వద్ద నుంచి డబ్బులు.. భూములు తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసిచ్చారని.. ప్లాట్లు అమ్ముడుపోగానే డబ్బులు ఇస్తానని చెప్పి.. ఇప్పుడు ఈ తరహాలో బెదిరింపులకు దిగుతున్నట్లు పేర్కొన్నారు.

తాను స్టార్ట్ చేసిన వెంచర్ లోనే స్కూల్.. కాలేజీని ఏర్పాటు చేసిన ఆయన.. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదన్న విమర్శ ఉంది. ఈ మధ్యనే రెండో కంటికి తెలీకుండా కాలేజీని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అమ్మేసినట్లుగా చెబుతున్నారు.

కాలేజీ అమ్మిన తర్వాత పత్తా లేకుండాపోయాడని.. డబ్బులు ఇచ్చిన వారంతా కాలేజీని అమ్మిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారని భావించారని.. కానీ అలా జరగలేదని చెబుతున్నారు. డబ్బులు అడిగిన రైతులపై బెదిరింపులకు దిగుతున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా విడుదలైన కరపత్రం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.