Begin typing your search above and press return to search.
టీడీపీ సీనియర్ నేత - మాజీ మంత్రికి కరోనా
By: Tupaki Desk | 25 Aug 2020 3:38 AM GMTదేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, సీఎంలకు కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకింది. ఆయన కోలుకొని మరీ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనాకు కల్లెం పడడం లేదు. కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8601 మందికి కరోనా సోకగా.. ఒక్కరోజులోనే 86మంది మృత్యువాత పడుతున్నారు. ఏపీలో సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కరోనా అందరికీ సోకుతోంది.
తాజాగా మరో టీడీపీ నేతకి కరోనాగా నిర్ధారణ అయ్యింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. టెస్ట్ చేయించుకోవడంతో వైరస్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు పల్లె రఘునాథ్ రెడ్డిని తరలించారు. తనతో కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని పల్లె రఘునాథ్ రెడ్డి కోరారు.