Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం పళనిస్వామి .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   18 Dec 2020 4:47 AM GMT
కమల్ హాసన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం పళనిస్వామి .. ఎందుకంటే ?
X
బిగ్ బాస్ .. బిగెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన ప్రారంభమై , ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి కూడా వచ్చి , మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మనదేశంలో మొదటగా హిందీ లో ఈ షో టెలికాస్ట్ అయింది. ఆ తరవాత తెలుగు , తమిళ్ , కన్నడ , మళయాలం భాషల్లో ప్రారంభమైంది. తెలుగు లో ప్రస్తుతం నాల్గో సీజన్ ముగింపుకి చేరుకుంది. ఇక తమిళ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ చేస్తున్నారు. అయన ఈ షో ను ఆసక్తికరంగా ముందుకు తీసుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే ఒక వైపు సినిమాలు , మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూనే కమల్ రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. మక్కల్ నీధి మయ్యం పేరుతొ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది తమిళనాడు లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్ ఇప్పటినుండే సన్నధం అయ్యి మదురై నుండి ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కమల్ హాసన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎలా వస్తారంటూ ఆయన కమల్ ‌ను ప్రశ్నించారు. తిరుచ్చిలో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... 70 ఏళ్ల వయసులో ఆయన బిగ్ బాస్‌ కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ ‌బాస్‌ కు హోస్ట్ గా ఉన్న ఓ వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వస్తారు, ఆయన చేస్తున్న పని వల్ల అనేక కుటుంబాలు నాశనం అయ్యాయి. దాన్ని పిల్లలు చూస్తే పాడైపోతారు. మంచి కుటుంబాలు కూడా చెడిపోతాయి..అని ఆరోపణలు చేశారు. అయితే , పళనిస్వామి నేతృత్వం వహిస్తున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీని కూడా ప్రముఖ నటుడైన ఎంజీ రామచంద్రన్ ప్రారంభించారు. తర్వాత ఆ పార్టీని నడిపించిన జయలలిత కూడా నటనా నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఆమె తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరి సీఎం కామెంట్స్ పై కమల్ ఏ విధంగా స్పందిస్తారో