Begin typing your search above and press return to search.
బాబుకు ఒళ్లు మండే మాటన్న మేధావి ప్రముఖుడు
By: Tupaki Desk | 19 Aug 2016 8:58 AM GMTకొందరికి కొన్ని మాటలు అస్సలు నచ్చవు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రూ.లక్ష కోట్ల మాట ఎత్తితే చాలు చిరాకు పడిపోతారు. అదే చంద్రబాబు నాయుడు దగ్గర అమరావతి కోసం వేలాది ఎకరాల అవసరం ఏమిటన్న మాట వినిపిస్తే చాలు అగ్గి ఫైర్ అవుతారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లి.. సచివాలయానికి రాకుండా ఫాంహౌస్ లో గడిపేస్తారనంటే చిరాకు పడతారు.
ఇలా ఒక్కో అధినేతకు నచ్చని మాటలు కొన్ని ఉంటాయి. ఏ రాజకీయ నాయకుడో.. రాజకీయ ప్రత్యర్థో తమను విమర్శించే క్రమంలో ఇలాంటి మాటల్ని ప్రస్తావిస్తే వారు పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక మేధావి ప్రముఖుడి నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే వారు అస్సలు తట్టుకోలేరు. తాజాగా ఒక ప్రముఖ వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలు ఏపీ ముఖ్యమంత్రి చెవికి చేరితే ఆయన ఆగ్రహంతో ఊగిపోవటం ఖాయమని చెప్పాలి.
ఇంతకీ ఆ మేధావి ప్రముఖుడు ఎవరంటారా? ప్రముఖ పాత్రికేయుడు.. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాద్. తాజాగా ఆయన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సేకరించిన భూముల లెక్కపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఎందుకని సూటిగా ప్రశ్నించిన ఆయన.. రాజధానిని 1500 ఎకరాల నుంచి 4వేల ఎకరాల్లో నిర్మించొచ్చని.. అది కూడా అద్భుతమైన రాజధానిని అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విషయం తానుచెప్పటం లేదని.. పలువురు నిపుణులు ఇదే మాటను చెబుతున్నారన్నారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సూటిగా ప్రశ్నిస్తున్న ఆయన. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇంత భారీ భూమి అవసరం కావొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ రాజధాని కోసం కేవలం రెండు వేల ఎకరాలు మాత్రమే సేకరించిన విషయానని వెల్లడించిన పాలగుమ్మి మాటలు వింటే ఏపీ ముఖ్యమంత్రికి కోపం రావటం ఖాయం. అయితే.. పాలగుమ్మి మాటల్లో ఒక మాట కాస్త తేడా కొట్టిందని చెప్పాలి. రైతుల నుంచి భూమిని బలవంతంగా సేకరించారన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. చాలా తక్కువ భూమి విషయంలో తప్పించి.. రాజధాని కోసం సేకరించిన ఈ భారీ భూసేకరణకు వ్యతిరేకత రాలేదన్న విషయం ఆయన దృష్టికి వచ్చినట్లుగా కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన కాస్త కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.