Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం జగన్ 23 అడుగుల భారీ కటౌట్ కి పాలాభిషేకం!
By: Tupaki Desk | 3 Oct 2020 9:10 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత , ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా , వారి గడప వద్దకే పాలన తీసుకుపోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమల్లోకి తీసుకొచ్చిన వ్యవస్థ గ్రామ/ వార్డ్ సచివాలయ వ్యవస్థ. ఇక ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నేపథ్యంలో విజయవాడ బీఆర్టీస్ రోడ్డులో ‘థ్యాంక్యు సీఎం’ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి 23 అడుగుల భారీ కటౌట్ కి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రేన్ ద్వారా పాలాభిషేకం చేశారు. ఈ గ్రామ /వార్డ్ సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయని అంజాద్ బాషా తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికే సంక్షేమ పథకాలు వస్తున్నాయని వెల్లడించారు. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగానే వాలంటీర్లు సైనికుల్లా పని చేయాలని సూచించారు. జగన్ స్ఫూర్తితో ఏపీ గ్రామ స్వరాజ్యం వైపు పయనిస్తోందన్నారు. గాంధీజీ కలలు సాకారం చేస్తున్న ఏపీ వైపే అన్నిరాష్ట్రాలు చూస్తున్నాయని ఆయన వివరించారు.