Begin typing your search above and press return to search.

పాక్ మోడ‌ల్ తండ్రి మ‌నిషి అనిపించుకున్నాడు!

By:  Tupaki Desk   |   22 July 2016 2:28 PM GMT
పాక్ మోడ‌ల్ తండ్రి మ‌నిషి అనిపించుకున్నాడు!
X
పాకిస్థాన్ మోడ‌ల్‌ - సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఖండీల్ బ‌లోచ్ దారుణ హ‌త్య నేప‌థ్యంలో ఆయ‌న తండ్రి వ్య‌వ‌హ‌రించిన తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. ఖండీల్‌ను హ‌త్య చేసిన త‌న కుమారుడు వ‌సీం అజీమ్‌ ను కాల్చి పారేయండ‌ని బ‌లోచ్ తండ్రి అన్వ‌ర్ అజీమ్‌ ను డిమాండ్ చేశారు. బ‌లీచ్ హ‌త్య జ‌రిగిన దాదాపు ఐదు రోజుల త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన ఆమె తండ్రి చేసిన డిమాండ్ ఆస‌క్తిక‌రంగా మారింది. బలోచ్‌ ను ఆమె సోద‌రుడు వ‌సీమే గొంతు నులిమి చంపిన విష‌యం తెలిసిందే.

బ‌లోచ్‌ను హ‌త్య చేసే సమ‌యంలో వ‌సీమ్ త‌మ‌కు కూడా డ్ర‌గ్స్ ఇచ్చాడ‌ని అన్వ‌ర్ అజీమ్ ఆవేద‌న‌గా చెప్పారు. తాము మ‌త్తులో ఉన్నందున విష‌యం తెలియ‌లేదు కానీ... త‌న కూతురు సాయం కోసం అర్థించి ఉండొచ్చ‌ని అన్వ‌ర్ వాపోయాడు. త‌న కూతురిని అన్యాయంగా పొట్ట‌న‌బెట్టుకున్నాడ‌ని ఆయ‌న అన్నారు. బ‌లోచ్ త‌న‌తో ఎంతో స్నేహంగా మెలిగేద‌ని, అన్ని విష‌యాలు పంచుకునేద‌ని ఆమె త‌ల్లి చెప్పింది. త‌మ‌కు పాల‌ల్లో డ్ర‌గ్స్ క‌లిపి ఇవ్వ‌డంతో గాఢ‌నిద్ర‌లోకి జారుకున్నామ‌ని ఆమె వెల్ల‌డించింది.

ప‌రువు హ‌త్య‌ల‌కు పెట్టింది పేర‌యిన పాకిస్తాన్‌ లో బ‌లోచ్ హ‌త్య అతివాదుల‌ను సంతృప్తి ప‌రిచింది. కానీ ఆమె త‌ల్లిదండ్రులు చేసిన ప్ర‌క‌ట‌న ఇపుడు ఆస‌క్తిక‌రంగా మారింది.