Begin typing your search above and press return to search.
లండన్ వైరల్ - పాకిస్థానీ యువకుడు వర్సెస్ ఇండియన్ బామ్మ
By: Tupaki Desk | 16 Sept 2019 10:27 PM ISTఇటీవలే జరిగిన ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ కసిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా విరుచుకు పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా బ్రిటన్ దేశంలో జరిగిన ఓ సంఘటనే దీనికి అసలైన ఉదాహరణ. బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్ లో ఓ భారతీయ వృద్ధురాలితో పాకిస్తాన్ యువకుడు గొడవకు దిగిన సంఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతీయ కుటుంబం నిల్చొని ఉన్న చోటికి వెళ్లిన పాకిస్తానీ యువకుడు కశ్మీర్ విషయంలో వాళ్లతో తగాదా పడ్డాడు. కశ్మీర్ వైపు ఎవరినీ రానివ్వనంటూ వ్యాఖ్యలు చేయడంతో ఓ భారతీయ వృద్ధురాలు ఎదురుదాడికి దిగింది. అతని బెదిరింపులకు ఏ మాత్రం బెదిరిపోకుండా తిరగబడింది. అది నా దేశం.. ఎక్కడైనా తిరుగుతాను. అడగడానికి నువ్వెవరు? అంటూ పాకిస్థాన్ యువకుడిని ఓ ఆట ఆడేసుకుంది సదరు వృద్ధ మహిళ. ఆమె వీరత్వం చూసి ఏమీ అనలేక అక్కడి నుంచి తిన్నగా తోక ముడిచాడు ఆ పాకిస్థానీ యువకుడు. వెళ్తూ వెళ్తూ కశ్మీర్ కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని అతను విర్రవీగడం గమనార్హం.