Begin typing your search above and press return to search.

పాక్ ప్రధాని కొట్టాడు.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి రేప్ చేశాడు

By:  Tupaki Desk   |   6 Jun 2020 8:10 AM GMT
పాక్ ప్రధాని కొట్టాడు.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి రేప్ చేశాడు
X
అమెరికాకు చెందిన బ్లాగర్ సింథియా డి రిచీ.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ప్రధానిపై సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తనను రేప్ చేశాడని సింథియా ఆరోపించింది. 2011లో అప్పటి విదేశాంగ మంత్రి రెహమాన్ తాను మద్యం తాగాక అత్యాచారం చేశాడని తెలిపింది. తన వద్ద దీనికి సంబంధించి ఆధారాలున్నాయని.. వచ్చే వారంలో మీడియాకు విడుదల చేస్తానని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఆరోపించారు.

అమెరికా నుంచి 2009లో సింథియా పాకిస్తాన్ కు వచ్చారు. నాటి పాక్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారు. నాటి విదేశాంగ శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తనపై రేప్ చేశాడని.. నాటి ప్రధాన మంత్రి యూసుఫ్ రాజా గిలానీ కూడా తనపై చేయి చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జలీ జర్ధారీ అధికారిక నివాసం ఇస్లామాబాద్ లోని ప్రెసిడెంట్ హౌస్ లో ఈ దాడి చేశారని ఆరోపించారు.

ఈ ముగ్గురి చేష్టలకు సంబంధించిన తన వద్ద వీడియో ఫుటేజీ ఉందని.. వచ్చేవారంలో విడుదల చేస్తానని బాంబు పేల్చింది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా సంచలనమైంది. ఆ నాటి ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు.