Begin typing your search above and press return to search.
ఇండియాను తీవ్రవాద దేశంగా ప్రకటించాలట?
By: Tupaki Desk | 11 Oct 2016 4:43 AM GMTదొంగే... దొంగా దొంగా అని అరిస్తే ఎలా ఉంటుంది.. తనకు అంటుకున్న దరిద్రాన్ని అందరికీ అంటించాలంటే ఏమనుకోవాలి.. ప్రస్తుతం పాక్ వ్యవహరిస్తున్న తీరు అలానే ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ ఒక ఉగ్రవాద దేశమని, పాకిస్థాన్ అనేది ఉగ్రవాదులకు పుట్టినిళ్లు, మెట్టినిళ్లని ఇంకా గట్టిగా మాట్లాడితే ఉగ్రవాదులంటే పాక్ అప్రకటిత సైన్యమే అని ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఈ క్రమంంలో పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ భారతీయుల ద్వారా వైట్ హౌస్ వెబ్ సైట్ లో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో అమెరికాలోని పాకీస్థానీలు కూడా తాజాగా ఒక ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలనేది వారి కోరిక.
ఈ చర్యను నిస్సిగ్గు చర్య అనాలో లేక వారికంటుకున్న బురదను ఇతరులకూ అంటించే విధానం అనాలో కానీ భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ 94,060 సంతకాలతో వైట్ హౌస్ లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ అక్టోబర్ 27 నాటికి మరో 5940 సంతకాలను పొందాల్సి ఉండగా దీన్ని వైట్ హౌస్ అంగీకరించింది. ఇలా వెబ్ సైట్ లో దాఖలైన పిటిషన్ మొత్తం 1,00,000 సంతకాలను పొందగలిగితే అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా నుంచి సమాధానం పొందేందుకు అర్హత పొందుతుంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ - ఆల్-ఖైదా వంటి బలూచిస్థాన్ తీవ్రవాద సంస్థలకు భారత్ సహాయం చేస్తున్నట్లు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏజెంట్ కుల్భూషన్ యాదవ్ స్వయంగా ఒప్పుకోవడమే దీనికి ఉన్న పెద్ద నిదర్శనమని, సాక్ష్యమని ఆ పిటిషన్ లో పాకిస్థానీలు పేర్కొన్నారు.
కాగా అంతకు ముందు పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ భారతీయుల ద్వారా దాఖలైన పిటిషన్ ను వైట్ హౌస్ వెబ్ సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్ చరిత్రలోనే అనూహ్య స్పందన లభించి, అంతకు ముందు ఏ పిటిషన్ కు రానన్ని సంతకాలు పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలన్న పిటిషన్ కు రావడంతో సరికొత్త రికార్డును సైతం సృష్టించింది ఈ పిటిషన్. 60 రోజుల్లోగా వైట్ హౌస్ ఆ పిటిషన్ పై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉండగా, ఈ లోపే భారత్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలంటూ పాకిస్థానీల నుంచి పిటిషన్ దాఖలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/