Begin typing your search above and press return to search.

ఎవరీ అమూల్య లియోన్..ఎందుకని పాకిస్థాన్ జిందాబాద్ అన్నది?

By:  Tupaki Desk   |   21 Feb 2020 5:30 PM GMT
ఎవరీ అమూల్య లియోన్..ఎందుకని పాకిస్థాన్ జిందాబాద్ అన్నది?
X
దాయాది.. భారతదేశం ఎప్పుడు నాశనమైపోతుందా? అని నిత్యం కుయుక్తులు పన్నేటోళ్లు భారీగా ఉండే పొరుగుదేశం మీద ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తూ.. దుర్మార్గం గా ఆ దేశానికి జిందాబాద్ కొట్టిన ఒక యువతి వ్యవహారం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసే ధోరణి పెరుగుతోంది. ఇదో పక్క ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో.. ఆహ్వానం లేని అమూల్య లియోన్ మైకు పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ ఎలా అనగలిగింది? ఆమె ఎవరు? ఎక్కడి వారు? గతంలో ఆమెకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూస్తే..

అమూల్య సొంతూరు చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా గుర్తించారు. ఆమెను తాము కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పిన నేపథ్యంలో.. ఒకవేళ అదే నిజమైతే.. ముక్కుముఖం తెలీనోళ్లను.. ఆహ్వానం పంపనోళ్లను మజ్లిస్ అధినేత లాంటి పెద్ద నేత ఉన్న వేదిక మీద ఆయన పక్కన ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారన్నది ప్రశ్న.

ఆమెకు.. తాము నిర్వహించిన కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని.. ఆహ్వానం పంపలేదని నిర్వాహకుడు ఇమ్రాన్ పాషా చెబుతున్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా అది నేరమేనని ఆయన చెబుతున్నారు. ఇక.. అమూల్య ఫేస్ బుక్ ను చూస్తే.. ఇలాంటి పనిని ఆమె పక్కా వ్యూహంతోనే చేసినట్లు గా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఇది తాను పాల్గొనే మూడో ఆందోళన అని.. ఆ సభలో తానేం మాట్లాడబోతున్న విషయాన్ని ఫేస్ బుక్ లో రాసుకుంది. ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితమే హుబ్లీలోని కేఎల్ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ముగ్గురు ముస్లిం విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి.. అరెస్టు అయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అమూల్యను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె తీరుపై యావత్ దేశం భగ్గుమంటోంది. పలుచోట్ల ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏ ఉద్దేశంతో ఇదంతా చేసిందన్న విషయం పోలీసుల విచారణలో కానీ తేలేటట్లు లేదు.