Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ యువ‌తి వీడియో వైర‌ల్‌.. షేర్ చేస్తున్న భార‌తీయులు!

By:  Tupaki Desk   |   16 Feb 2021 11:30 PM GMT
పాకిస్థాన్‌ యువ‌తి వీడియో వైర‌ల్‌.. షేర్ చేస్తున్న భార‌తీయులు!
X
సోషల్ మీడియా విస్తృత‌మైన త‌ర్వాత ఎప్పుడు.. ఎవ‌రు.. ఎలా ఫేమ‌స్ అవుతారో ఎవ్వ‌రూ చెప్ప‌లేకున్నారు. తాజ‌గా ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో నిడివి కేవ‌లం నాలుగు సెక‌న్లు. చూస్తుండ‌గానే ఫేమ‌స్ అయిపోన వీడియో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

ఈ వీడియోలో ఆ యువతి చేతితో మొబైల్ కెమెరా పట్టుకుని 'ఇది నా కారు' అని తన కారును చూపిస్తుంది. ఆ తర్వాత 'ఇది మేము' అంటూ స్నేహితులను చూపిస్తుంది. తర్వాత 'ఇక్కడ మా పార్టీ జరుగుతోంది' అని వారు చెబుతారు. ఫ్రెండ్స్ తో కలిసి చేసిన వీడియో.. సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది.

'మీమ్స్' తో రూపొందిన ఈ వీడియోను.. రూపొందించిన యువతి పేరు దనానీర్‌. పాకిస్తాన్‌లోని పెషావర్‌ వాసి. 'కంటెంట్ క్రియేటర్' అయిన దనానీర్.. మేకప్, ఫ్యాషన్‌ డిజైన్ల నుంచి మొదలు అనేక విషయాలపై వీడియోలు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు దాదాపు పది లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి. వీడియో వైరల్‌ అయిన తర్వాత దనానీర్ ఫాలోవర్ల సంఖ్య 2 లక్షలు దాటడం గమనార్హం.

అయితే.. ఆ వీడియో తయారు చేయాలని ముందుగా ప్లాన్ చేసుకోలేదని చెప్తోందీ 19 ఏళ్ల దనానీర్‌. స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్తుండగా.. మధ్యలో ఈ వీడియో చేసినట్టు చెప్పిందీ పాక్ అమ్మాయి. తన వీడియోకు వస్తున్న పాపులారిటీపై ఆనందం వ్యక్తంచేసిన దనానీర్.. ప్రపంచమంతా విడిపోయి ఉన్న సమయంలో.. అందరినీ కలిపే ఇలాంటి అంశాలు ఎంతో గొప్పవి అంటోందీ యువతి. "నా వీడియో కారణంగా మేము, మా పొరుగువారు(ఇండియన్స్) కలిసి పార్టీ చేసుకోవడం సంతోషంగా ఉంది" అంటోందీ పాకిస్తాన్ యువతి. #PawriHoRahiHai హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. భారత్ తోపాటు చాలా దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.