Begin typing your search above and press return to search.
ఏళ్ల తరబడి పాక్ మహిళ అక్రమ నివాసం.. నకిలీ గుర్తింపు కార్డులతో జల్సా!
By: Tupaki Desk | 12 Jun 2021 2:30 AM GMTఈ దేశంలో పుట్టి వాస్తవ ధ్రువపత్రాలతో ఏదైనా గుర్తింపు కార్డు తీసుకోవాలి అంటేనే నానా హంగామా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఓ మహిళ మాత్రం ఊరు కానీ ఊరు దేశం కానీ దేశంలో అవలీలగా నకిలీ గుర్తింపు కార్డులు పొందింది. అంతేకాదు ఏళ్ల తరబడి అక్రమ నివాసం ఉంటోంది. ఈ విషయాన్ని గుర్తించడానికి స్థానిక ప్రభుత్వం, పోలీసులకు ఎనిమిదేళ్లు పట్టడం గమనార్హం.
పాకిస్థాన్ కు చెందిన ఖాతిజా మెహరీన్ అనే మహిళ కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కారవార సమీపంలోని బట్కల్ లో నివాసం ఉంటోంది. ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ ఉండే ఆ ప్రాంతంలో భర్త జావేద్, ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ఎనిమిదేళ్లుగా ఉంటోంది. అక్రమ నివాసం మాత్రమే కాకుండా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ఇలా అన్ని గుర్తింపు కార్డులను ప్రభుత్వం నుంచి యథేచ్ఛగా పొందింది. ఇవన్నీ ఎలా తీసుకుంది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత 2014 లో టూరిస్టు వీసాతో మూడు నెలల అనుమతితో బట్కల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లిన ఆమె అక్రమ మార్గంలో భారత్ లో ప్రవేశించిందని పేర్కొన్నారు. ఆ మహిళ అక్రమ నివాసాన్ని కొన్ని నెలల ముందే గ్రహించిన అధికారులు నిఘా పెట్టినట్లు తెలిపారు. అనంతరం పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేయడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు తాము గుర్తించలేకపోయామని నివ్వెరపోయారు. ఎనిమిదేళ్ల అక్రమ నివాసం తర్వాత అరెస్ట్ చేసిన ఆమెను కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఆమెకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.