Begin typing your search above and press return to search.
ఇండియాపై పాక్ అణుబాంబు వేయాలనుకుందా?
By: Tupaki Desk | 3 Dec 2015 11:29 AM GMTకార్గిల్ యుద్ధంలో బొక్కబోర్లా పడిన తరువాత పాకిస్థాన్ భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలని అనుకుందట... యుద్దంలో గెలవడం తనవల్ల కాకపోవడంతో ఏకంగా అణుబాంబు వేద్దామని కూడా భావించిందట.. అయితే... అంతర్జాతీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి ఆగిపోయిందని చెబుతున్నారు.
ఇండియాపై అణుబాంబులు వేయడానికి పాక్ రెడీ అయిందని అప్పట్లో సీఐఏ అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కు చెప్పిందని వైట్ హౌస్ మాజీ ఉన్నతాధికారి బ్రూస్ రీడెల్ ప్రకటించారు. 1999లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తో సమావేశానికి అమెరికా వెళ్లారు. అదే సమయంలో పాక్ సైనిక జనరల్ ముషారప్ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వారు. అయితే... ఇండియా సైన్యం ఆ దాడులను తిప్పికొట్టి పాక్ ఆధీనంలోని స్థావరాలను స్వాధీనం చేసుకుంది. దీంతో తనకు తెలియకుండానే మొదలైనా కూడా పాక్ ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో షరీఫ్ ఎంటరై ఇండియాతో సామరస్య పూర్వక సంధి కోసం ట్రై చేశారు. అయినా... ఇండియా ఏమాత్రం తగ్గకుండా పాక్ సేనలను తరిమితరిమి కొట్టింది. ఆ సమయంలో పాక్ ఇండియాపై అణ్వాయుధాలు వేయాలని అనుకుందని బ్రూస్ రీడెల్ వెల్లడించారు.
క్లింటన్ మాజీ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ మృతిచెందడంతో ఆయన స్మృత్యర్థం బ్రూస్ మాట్లాడుతూ ఈ వివరాలన్నీ వెల్లడించారు. కార్గిల్ యుద్ధాన్ని పాక్ మొదలుపెట్టడంతో ఆపాల్సింది కూడా వారేనని.. షరీఫ్ కు ఆ విషయం చెప్పాలని క్లింటన్ కు బెర్జర్ సూచించారని చెబుతూ బ్రూస్ ఈ సంగతులన్నీ వెల్లడించారు.