Begin typing your search above and press return to search.

భార‌త్‌ కు పాక్ ప్ర‌తీకార వార్నింగ్‌

By:  Tupaki Desk   |   15 Nov 2016 8:08 AM GMT
భార‌త్‌ కు పాక్ ప్ర‌తీకార వార్నింగ్‌
X
భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి సోమ‌వారం జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ జ‌వాన్లు హ‌త‌మ‌య్యారు. భార‌త బ‌ల‌గాల‌పై పాక్ సైన్యం కాల్లుల‌కు దిగ‌డంతో దీనిని ధీటుగా ఎదుర్కొన్న భార‌త సైన్యం పాక్ జ‌వాన్ల‌ను మ‌ట్టుబెట్టింది. అయితే, ఈఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ .. తమ సైన్యాన్ని కొల్పోయామ‌ని అంగీక‌రించ‌డంతోపాటు త్వ‌ర‌లోనే దీనికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించింది. భార‌త్ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా మొహమ్మద్ ఆసిఫ్ - జియో న్యూస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

వాస్త‌వానికి ప‌ఠాన్ కోట్ ఉగ్ర‌దాడి అనంతరం జ‌రిగిన మ‌రో దాడిలో 18 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో భార‌త్ విరుచుకుప‌డింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఎల్‌ వోసీ వ‌ద్ద పాక్ సైన్యం వ‌రుస‌గా కాల్పుల‌కు పాల్ప‌డుతూనే ఉంది. ఈ క్ర‌మంలో నిన్న భీమ్ బర్ సెక్టారులో పాక్ హెవీ వెపన్స్ తో కాల్పులు జరుపగా - భారత సైన్యం ధీటుగా స్పందించింది. దీంతో పాక్ సైనికులు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, దీనిని పాక్ అంగీక‌రించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి మొన్నామ‌ధ్య కూడా పాక్ సైనికులు ఇద్ద‌రు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. అయినా కూడా పాక్ అంగీక‌రించ‌లేదు.

భార‌త సైన్యం దాదాపు 20 మంది వ‌ర‌కు ఇప్ప‌టికి పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దృష్టి సారించాల‌ని భార‌త్ ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి చేసినా.. నొప్పి త‌గ‌ల‌ని పాక్‌... తాజా ప‌రిణామం నేప‌థ్యంలో త‌మ సైనికులకు పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగింద‌ని, ఇంట‌ర్నేష‌న‌ల్ క‌మ్యూనిటీ ప‌ట్టించుకోవాల‌ని మొస‌లి క‌న్నీరు కారుస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజా ఘ‌ట‌నపై స్పందించిన పాక్ ర‌క్ష‌ణ మంత్రి.. ఆసిఫ్‌.., "అంతర్జాతీయ కమ్యూనిటీ ఇకనైనా భారత్, పాక్ మధ్య దృష్టిని సారించాలి. రీజియన్ లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది" అని వ్యాఖ్య‌నించ‌డం.. చూస్తుంటే.. ఎవ‌రికి కింద‌కి నీళ్లొస్తే.నే వాళ్ల‌కి బాధ తెలుస్తుంద‌నే సామెత నిజ‌మ‌వుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/