Begin typing your search above and press return to search.

దాయాది బండారాన్ని బ‌య‌ట‌పెట్టిన పాక్ మాజీ అధ్య‌క్షుడు

By:  Tupaki Desk   |   7 March 2019 6:53 AM GMT
దాయాది బండారాన్ని బ‌య‌ట‌పెట్టిన పాక్ మాజీ అధ్య‌క్షుడు
X
దాయాది పాక్ దొంగ బుద్ధి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సంచ‌ల‌నంగా మారిన ఈ విష‌యాల్ని ప్ర‌క‌టించింది ఎవ‌రో కాదు పాక్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష్రార‌ఫ్. ప్ర‌స్తుతం పాక్ కు బ‌య‌ట దూరంగా ఉన్న ఆయ‌న‌.. ఒక జ‌ర్న‌లిస్ట్ కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింద‌ని ప్ర‌పంచ దేశాలు న‌మ్ముతున్నా.. పాక్ మాత్రం అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని ముష్రార‌ఫ్ చెప్ప‌క‌నే చెప్పేశారు. ఉగ్ర‌వాదుల విష‌యంలో పాక్ తీరును ఆయ‌న బ‌య‌ట‌పెట్టేశారు. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని న‌డుపుతున్న జైషే ఎ మ‌హ్మ‌ద్ తీవ్ర‌వాద సంస్థను పాక్ ప్ర‌భుత్వం పెంచి పోషిస్తుంద‌న్నారు. భార‌త్ లో దాడులు జ‌రిపేందుకు పాక్ నిఘా వ‌ర్గాలు జైషేను ఉప‌యోగించుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

టెలిఫోన్ లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ 2003లో జైషే ఎ అహ్మ‌ద్ సంస్థ త‌న‌ను రెండుసార్లు చంప‌టానికి ప్ర‌య‌త్నించింద‌ని.. ఆ సంస్థ‌పై తాజాగా చ‌ర్య‌లు తీసుకోవ‌టం మంచిద‌న్నారు. మ‌రి.. మీ హ‌యాంలో ఆ సంస్థ సంగ‌తి ఎందుకు చూడ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. అప్ప‌టి ప‌రిస్థితులు వేరుగా ఉండేవ‌న్నారు. జైషే సంస్థ త‌న‌ను రెండుసార్లు చంపేందుకు ప్ర‌య‌త్నించింద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌టం మంచిదేన‌న్నారు. పాక్ ప్ర‌భుత్వానికి.. జైషేకు మ‌ధ్య‌నున్న అనుబంధాన్ని ముష్రార‌ఫ్ మాట‌ల‌తో మ‌రోసారి రుజువైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.