Begin typing your search above and press return to search.
ఒళ్లో కూతుర్ని పెట్టుకొని వార్తలు చదివి నిరసన!
By: Tupaki Desk | 12 Jan 2018 4:14 AM GMTనిత్యం బాంబు దాడులతో.. ఉగ్రదాడులతో ఎక్కడో ఏదో ఒక హింసాత్మక ఘటన చోటు చేసుకునే దాయాది దేశంతో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లు కూడా నిండని ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి..హత్య చేసిన ఉదంతం ఆ దేశాన్ని అట్టుడికిపోయేలా చేస్తోంది.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై తన నిరసనను ప్రదర్శించిందో న్యూస్ రీడర్. ఎప్పటిమాదిరి కాకుండా తన కుమార్తెను వెంట పెట్టుకొని టీవీ ఛానల్ కు వచ్చిన ఆమె.. వార్తలు చదివే క్రమంలో ఒక్కతే కెమేరా ముందుకు రాకుండా.. వెంట తన కుమార్తెను ఒడిలో కూర్చొపెట్టుకొని వార్తలు చదవటం గమనార్హం.
అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారి జైనాబ్ అన్సారీని అత్యాచారం చేసి హతమార్చేసిన వైనాన్ని చెప్పకనే చెబుతూ.. వార్తలు చదవటం సంచలనంగా మారింది. "నేనీ రోజు మీ వ్యాఖ్యాత కిరన్ నాజ్ ను కాను. ఓ అమ్మను. అందుకు నా కుమార్తెను వెంట తెచ్చుకున్నాను. ఒడిలో కూర్చోబెట్టుకొని వార్తలు చదువుతున్నాను" అంటూ ఉద్వేగభరితురాలై వార్తలు చదివారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చిన్నారిని దారుణంగా అత్యాచారం ఆపై హత్య చేసి చెత్తకుప్పలో పడేశారు. కసూర్ వీధుల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహం అక్కడి స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. యావత్ దేశాన్ని కదిలించిన ఈ దురాగతానికి పాల్పడిన నిందితుల్ని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని.. వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి హత్యకు గురైన ప్రాంతంలోని వారైతే ఆవేశానికి గురై పోలీస్ స్టేషన్ వద్దకు నిరసన ప్రదర్శించేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నడుమ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో మరో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితుల్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ ఉదంతంపై పాక్ యావత్తు అట్టుడిగిపోతోంది.