Begin typing your search above and press return to search.

ఘోర రైలు ప్రమాదం... 30 మంది మృతి !

By:  Tupaki Desk   |   7 Jun 2021 3:44 AM GMT
ఘోర రైలు ప్రమాదం... 30 మంది మృతి !
X
దాయాది దేశమైన పాకిస్థాన్ లో నేడు (సోమవారం) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం జరిగింది. ఈ ఘటనలో 30 మంది వరకు దుర్మరణం చెందారని ప్రస్తుత సమాచారం. అలాగే , పలువురు గాయపడ్డారు. దక్షిణ పాక్ ఘోట్కీలోని రేతి, ధహార్కీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం సంభవించింది. సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్, మిల్లాట్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. లాహోర్‌ వైపు వెళ్తోన్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు, కరాచీ నుంచి సర్గోధా వెళుతున్న మిల్లాట్ ఎక్స్‌ ప్రెస్‌ రేతి-ధహార్కీ స్టేషన్‌ ల మధ్య ఢీకొడంతో రైళ్లు పట్టాలు తప్పాయి.

ప్రమాదం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం సాధారణంగా మారిపోయాయి. గతేడాది జులైలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందారు. పంజాబ్ ఫ్రావిన్స్‌ లోని షేక్‌ పురా రైల్వే క్రాసింగ్‌ వద్ద శుక్రవారం జులై 3 మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.