Begin typing your search above and press return to search.

శృంగార పాక్‌ : ముసుగు వేయొద్దు మనసుమీద...

By:  Tupaki Desk   |   20 Jan 2015 7:01 AM GMT
శృంగార పాక్‌ : ముసుగు వేయొద్దు మనసుమీద...
X
ముసుగువేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద.. అంటూ సాగే ఖడ్గం చిత్రంలోని పాట.. శృంగార ప్రియులను ఒక రేంజిలో ఉర్రూతలూగించేస్తుంది. ముసుగు వేసే కొద్దీ... మోజు పెరిగిపోవడం తప్ప.. కట్టడి చేయడం సాధ్యం కాదనేది మనకు చాలా చాలా ఉదాహరణల ద్వారా తెలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆంక్షలు ఎన్నో విచ్చలవిడిగా అమలులో ఉండే.. పాకిస్తాన్‌లో.. ఇంటర్నెట్‌ ద్వారా శృంగార ప్రియత్వాన్ని అన్వేషించే వారు అత్యధికంగా ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆంక్షలు పెరిగేకొద్దీ.. రహస్యంగా ఇంటర్నెట్‌లో తమ కామప్రియత్వాన్ని తీర్చుకునే తీరు.. పాక్‌లో శృతిమించుతున్నదని.. గూగుల్‌ లెక్కలు తెలియజెబుతున్నాయి.

సెక్స్‌కు సంబంధించి.. గూగుల్‌ ద్వారా సెర్చ్‌ చేస్తున్న వారిలో పాకిస్తాన్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని గూగుల్‌ తెలిపింది. సెక్స్‌ విషయంలో చిన్న చిన్న సమస్యలకు కూడా పాక్‌ వాసులు గూగుల్‌నే ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నది. అలాగే పాక్‌ తర్వాతి స్థానంలో ఈజిప్టు ఉన్నదిట. ఇరాన్‌, మొరాకో నాలుగైదు స్థానాల్లోను, సౌదీఅరేబియా టర్కీలు ఏడెనిమిది స్థానాల్లోనూ ఉన్నాయి. అయితే.. ఇలాంటి సెక్స్‌ సమాచారాన్ని లెబనాన్‌ టర్కీ దేశాలు తప్ప మిగిలిన అరబ్‌ దేశాలు నిషేధించాయి. దీంతో అక్కడి యువత ఇంటర్నెట్‌ ను అధికంగా ఆశ్రయిస్తున్నారనేది అంచనా. సెక్స్‌ వెతుకులాటలో.. మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు ముస్లిం దేశాలే కావడం విశేషంగా ప్రచారంలోకి వచ్చింది.