Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ పై మండి పడుతున్న పాకిస్థానీయులు
By: Tupaki Desk | 9 Aug 2019 7:46 AM GMTకశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్.. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరించి తప్పులో కాలేశారు. దాయాది దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మాత్రం రెచ్చిపోయినా భారీగా నష్టపోయేది పాకిస్థానే. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పాక్ ప్రజలకు ఇమ్రాన్ తాజా నిర్ణయాలు ఏ మాత్రం మింగుడుపడటం లేదు.
జమ్ముకశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించటం.. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయాల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భారత్ తో వాణిజ్యం సంబంధాలు కటీఫ్ చేసుకోవటంతో పాటు.. పాక్ నుంచి నడిచే ట్రైన్ ను నిలిపివేయటంతో పాటు..అన్ని రకాల దౌత్య సంబంధాల్ని కనిష్ఠస్థాయికి తెచ్చుకున్న వైనం పాకిస్థాన్ ప్రజలకు మహా ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వేళ.. భారత్ తో వాణిజ్య సంబంధాల్ని నిలిపివేసుకోవటం ద్వారా పాకిస్థానీ ప్రజల మీద పెద్ద ఎత్తున ప్రభావం ఫడుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా ఆకాశాన్ని అంటిన ధరలకు.. ఇమ్రాన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయాలతో ధరలు మరింత పెరిగిపోయి.. సగటుజీవి కొనలేని పరిస్థితి నెలకొంది. భారత్ నుంచి ఆహార దిగుమతులు నిలిపివేస్తూ పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు రోజుల్లో వచ్చే ఈద్ పండుగను ఎలా జరుపుకోవాలన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో ఎక్కువైంది.
ఇప్పటికే పెరిగిన ధరలకు.. తాజాగా ఖర్చులు మరింత పెరుగుతాయని.. ఇది సగటు జీవి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. పాలు.. కూరగాయలు.. మాంసం వరకూ అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో.. వంట సరుకుల్ని కొనలేని పరిస్థితులు ప్రజలకు ఎదురవుతున్నాయి. జీతాలు పెరగక.. ఆదాయాల్లో ఎలాంటి పెరుగుదల లేదని.. మరోవైపు పెరిగిన ధరలతో బండి ఎలా నెట్టుకురావాలో ఒకపట్టాన అర్థం కావటం లేదన్న మాట పలువురు మహిళలు వ్యక్తం చేస్తున్నారు.
తొందరపాటుతో ఇమ్రాన్ నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడు పెరిగిన ధరలతో తాము ఎలా బతకాలని? ఏం తినాలని? ప్రశ్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. పండుగ వేళ పెరిగిన ధరలతో వస్తువుల్ని కొనుగోలు చేయలేక ప్రజల్లో ఇమ్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజలు గడ్డి తినాలని ఇమ్రాన్ అనుకుంటున్నారా? ఆయన తీసుకున్న నిర్ణయాలతో నిత్యవసర వస్తువులు పెద్ద ఎత్తున పెరిగిపోయినట్లుగా పలువురు వ్యాపారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చేసిన ట్వీట్ ను గుర్తు చేసుకుంటున్నారు పలువరు. భారత్ తో వాణిజ్యాన్ని తెంచుకోవటం కారణంగా భారత్ చాలా ప్రభావితం అవుతుందంటూ ఆయన చేసిన వ్యంగ్య ట్వీట్ వైరల్ కావటం తెలిసిందే. ఇండియాతోవాణిజ్య ఒప్పందాల్ని పాక్ రద్దు చేసుకోవటం కారణంగా ఇండియాకు చాలా నష్టం వస్తుందని.. ఆ నష్టం ఎంతంటే .. విరాట్ కోహ్లీ ఇన్ స్రాలో ఒక ప్రమోషనల్ పోస్టు కోసం ఎంత తీసుకుంటాడో అంత నష్టం భారత్ కు కలుగుతుందని చెప్పటం ద్వారా పాక్ వాణిజ్య సంబంధాలు తెంచుకోవటం తర్వాత భారత్ మీద పడే ప్రభావం నామమాత్రం అన్న విషయాన్ని ధోవల్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. దీనికి తగ్గట్లే తాజాగా అక్కడి ప్రజల్లో ఇమ్రాన్ ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్న ఆగ్రహం ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు.