Begin typing your search above and press return to search.
రైతుల ఉద్యమానికి పాకిస్ధాన్ మద్దతా ?
By: Tupaki Desk | 30 Jan 2021 5:17 AM GMTవిచిత్రంగా ఉంది దాయాది దేశం పాకిస్ధాన్ వ్యాఖ్యలు. రైతుల ఉద్యమానికి పాకిస్ధాన్ మద్దతు అందిస్తుందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. చూస్తుంటే రైతుల ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని మనదేశ అంతరంగిక వ్యవహారాల్లో జొక్యం చేసుకునేందుకు పెద్ద ప్లానే వేసినట్లు అనుమానంగా ఉంది. రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీ వీధుల్లో రైతుసంఘాలు చేసిన ట్రాక్టర్ల ర్యాలీని పాకిస్ధాన్ సమర్ధిస్తోంది.
మనదేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతర్జాతీయస్ధాయిలో ఎండగట్టాలని డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. మానవ హక్కుల ఉల్లంఘనల గురించి పాకిస్ధాన్ మనకు నీతులు చెబుతోంది. సిఖ్ఖు కమిటీల సముదాయానికి పాక్ విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటి మద్దతిస్తుందని చెప్పటమే విచిత్రంగా ఉంది.
బీజేపీ మాతృసంస్ధ అయిన ఆరెస్సెస్ కారణంగానే రైతులు ప్రాణాలు కోల్పోయారని అలా ప్రాణాలు కోల్పోయిన రైతులకు పాకిస్ధాన్ అండగా ఉంటుందని చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది. పాకిస్ధాన్ విదేశాంగ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలతో ఇపుడు ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అందరికీ పాకిస్ధాన్ హస్తంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇఫ్పటికే రైతుల ఉద్యమం వెనుక పాకిస్ధాన్ కుట్రుందని, టెర్రరిస్టులు, మావోయిస్టుల మద్దతు కూడా ఉందని ఒకరిద్దరు కేంద్రమంత్రులు, కొందరు బీజేపీ ఎంపిలు చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.
కేంద్రమంత్రులు, ఎంపిల ఆరోపణలకు మద్దతుగానా అన్నట్లు పాకిస్ధాన్ విదేశాంగ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలున్నాయి. మొత్తం మీద ఏదో రూపంలో భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒకవైపు పాకిస్ధాన్ మరోవైపు చైనా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ఇంతవరకు పరోక్షంగానో లేకపోతే చెదురుమదురుగానో చేస్తున్న ప్రయత్నాలు ఇపుడు ఏకంగా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన బలపరుస్తున్నాయి.