Begin typing your search above and press return to search.

భారత్ పై తగ్గని పాక్.. మరో రద్దు..

By:  Tupaki Desk   |   28 Sep 2019 7:23 AM GMT
భారత్ పై తగ్గని పాక్.. మరో రద్దు..
X
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పై అగ్గిమీద గుగ్గీలం అవుతున్న పాకిస్థాన్ మరో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుందీ. ఇప్పటికే భారత్ కు బస్సు, రైల్వే సర్వీసులను నిలిపివేసిన పాక్.. భారత విమానాలను పాకిస్థాన్ గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధించింది. ఇక భారత్ నుంచి కూరగాయలు, నిత్యావసర వస్తువులు దిగుమతులు రద్దు చేసింది. పాక్ లో ధరలు మండుతున్నా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ వెనక్కి తగ్గడం లేదు..

తాజాగా భారత్ తో అవినాభావ సంబంధాలు కూడా పాకిస్థాన్ తెంచుకుంది.తాజాగా భారత్ కు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్నాల్లు పాకిస్తాన్ లో ప్రచురితమయ్యే మేగజైన్లు, ఇతర పబ్లికేషన్లు భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి పోస్టు ద్వారా పంపేవారు. అయితే ఇప్పుడు ఆ సేవలను కూడా పాకిస్తాన్ బ్రేక్ చేసింది.

ఇప్పటికే పాకిస్తాన్ చాలా వాటిని రద్దు చేయగా.. ఇప్పుడు పోస్టల్ సేవలను కూడా నిలిపివేయడంతో అన్ని బంధాలు తెంచుకున్నట్టు అయ్యింది. ఆగస్టు 23న భారత్ కు అన్ని పోస్టల్ సేవలను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేసినట్లుగా భారత పోస్టల్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ రాయ్ తెలిపారు. ఇక పాకిస్తాన్ కు ఉత్తరాలు రాయడం కానీ.. పాకిస్తాన్ నుంచి ఉత్తరాలు ఇక్కడికి పంపడం కానీ పోస్టల్ సేవలు ఇక ఉండవని రాయ్ స్పష్టం చేశారు.

ఇన్నాళ్లు భారత్ నుంచి సౌదీఅరేబియా విమానాల ద్వారా పాకిస్థాన్ కు పోస్టల్ సేవలను బట్వాడా చేసేది. పాకిస్థాన్ మన పంజాబ్ కు వాఘా సరిహద్దు ద్వారా పోస్టల్ సేవలను కొనసాగించేది.ఇప్పుడు పాకిస్థాన్ పోస్టల్ సేవలపై నిషేధం విధించడంతో భారత్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్టు అయ్యింది...