Begin typing your search above and press return to search.

పాక్‌ కు ఇండియ‌న్ ఆర్మీ చావు దెబ్బ

By:  Tupaki Desk   |   14 Nov 2016 1:06 PM GMT
పాక్‌ కు ఇండియ‌న్ ఆర్మీ చావు దెబ్బ
X
పాకిస్థాన్‌ ను ఇండియన్ ఆర్మీ మ‌రోసారి చావు దెబ్బ తీసింది. కశ్మీర్‌ లోని బీంబెర్ సెక్టార్‌ లో జ‌రిగిన కాల్పుల్లో ఇండియ‌న్ ఆర్మీ చేతుల్లో ఏడుగురు పాక్ సైనికులు హ‌త‌మ‌య్యారు. ఇదే అంశంపై పాక్ స్పందిస్తూ భార‌త్‌ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించిన పాకిస్థాన్‌... భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారన్న విష‌యాన్ని ధృవీక‌రించింది.

అయితే పాకిస్థాన్ ఆర్మీపై కాల్పులు జ‌రిగిన విష‌యాన్ని ఇంకా ఇండియన్ ఆర్మీ మాత్రం ధృవీకరించలేదు. విచిత్రం ఏంటంటే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే)లో ఉగ్ర‌వాద శిబిరాల‌పై ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడులు చేసిన‌ప్ప‌టి నుంచి పాక్ బ‌ల‌గాలు ప‌దే ప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎన్నో సార్లు దాడుల‌కు దిగాయి. ఈ కాల్ప‌ల‌ను తిప్పి కొట్టేందుకు జ‌రిగిన పోరాటాల్లో ఎంతో మంది భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు.

అయితే పాక్ మాత్రం తాజా దాడి త‌ర్వాత భార‌త్ మా సైన్యాన్ని చంపేసింద‌ని పెడ‌బొబ్బ‌లు పెడుతోంది. తాజా ఘ‌ట‌నలో ముందుగా ఇండియ‌న్ ఆర్మీ దాడులు చేయ‌డంతో మా బ‌ల‌గాలు ప్ర‌తిదాడులు చేసిన‌ట్టు పాక్ ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇక భార‌త ఆర్మీ చేస్తోన్న దాడుల్లో ఎక్కువ‌గా త‌మ దేశ పౌరులు కూడా చ‌నిపోతున్న‌ట్టు పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక పాక్ ఆరోప‌ణ‌లు ప‌క్క‌న పెడితే జమ్మూకాశ్మీర్‌ లోని యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. యూరీ దాడి తర్వాత పాక్ ఇప్పటికే 100సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/