Begin typing your search above and press return to search.

పాక్ నుంచి తీసుకొచ్చిన గీతను తాజాగా బాసర ఎందుకు తెచ్చారు?

By:  Tupaki Desk   |   16 Dec 2020 5:30 AM GMT
పాక్ నుంచి తీసుకొచ్చిన గీతను తాజాగా బాసర ఎందుకు తెచ్చారు?
X
గీత గుర్తుందా? కొన్నేళ్ల క్రితం జాతీయ.. అంతర్జాతీయ పత్రికల్లో ఆమె గురించిన వార్తాంశాలు మొదటి పేజీలో వచ్చేవి. ఇక.. చానళ్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. గంటల కొద్దీ ఆమె గురించే మాట్లాడేవారు. చిన్నతనంలో భారత్ లో తప్పిపోయి.. పాక్ చేరటం.. అక్కడి ఒక ఎన్జీవో ఆమెను అక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేసింది. ఇదిలా ఉంటే.. ఆమె ఉదంతం తెర మీదకు రావటం.. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవ తీసుకొని గీతను భారత్ కు తీసుకురావటంలో కీలకభూమిక పోషించారు.

దాదాపు ఐదేళ్ల క్రితం గీతను భారత్ కు తెచ్చారే కానీ.. ఆమె స్వస్థలం ఏది? ఆమె పూర్వీకులు ఎవరు? అన్న విషయాల్ని ఆమె మర్చిపోయింది. దీనికి తోడు చెవుడు.. మూగ అయిన ఆమె.. మాట్లాడే అన్ని మాటలు అర్థమవుతాయి కానీ.. తిరిగి మాట్లాడలేరు. అయితే.. తన కన్నవారికోసం తెగ ఆరాటపడుతున్న ఆమె.. తాజాగా చెబుతున్న పోలికల్ని చూస్తే.. బాసరకు సంబంధించిన వాళ్లు ఏమైనా ఉంటారా? అన్నది సందేహంగా మారింది.

దీనికి తోడు ఆమె.. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ అన్న పేరు చెబుతున్న నేపథ్యంలో ఆమెది దక్షిణాది ప్రాంతంగా భావించారు. ఆమెను గుర్తుకు తెచ్చుకొని చెబుతున్న వివరాల ఆధారంగా చేసుకొని.. ఆమె స్వగ్రామం నిర్మల్ జిల్లా బాసరకు చెంది ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో.. గీతను స్వయంగా తీసుకొచ్చి.. బాసర చుట్టు పక్కల ప్రాంతంలో చూపిస్తున్నారు. ఆమెకు ఏమైనా గుర్తుకు వచ్చే అవకాశం ఉన్నట్లుయితే.. దాన్ని గుడ్డిగా ఫాలో కావటానికి మించిన ఆప్షన్ వేరే ఒకటి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అయితే.. చుట్టపక్కల ప్రాంతాలు.. ఆమె గుర్తు చేస్తున్న ఆనవాళ్లతో సరిపోలుస్తున్నారు. మొత్తానికి గీత వ్యవహారం మరింత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈసారి గీతకు ఏమవుతుందన్నది చూడాలి. ఇప్పటికే మహా వెతుకులాటలో చేస్తున్న ప్రయత్నాలు గీతకు ఏమేరకు మేలు చేస్తాయో చూడాలి.