Begin typing your search above and press return to search.
ఆ ఉగ్రవాదికి డబ్బులు లేవని జాలి పడుతున్న పాక్
By: Tupaki Desk | 5 Oct 2019 9:18 AM GMTకుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ది మాత్రం మారడంలేదు. తాము ఉగ్రవాద బాధిత దేశమని చెప్తూనే ఆ దేశంలో ఉగ్రవాదులని తయారు చేసి ప్రపంచం మీదకి - ముఖ్యంగా భారత్ మీదకి వదులుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాల ఒత్తిడితో అంతర్జాతీయ ఉగ్రవాది - ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యద్ ను ఉగ్రవాదిగా ప్రకటించి అదుపులోకి తీసుకుంది. అతడి బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. ఇప్పుడేమో ఈ ఉగ్రవాది తరపున వకాల్తా పుచ్చుకుంటూ ఐరాసకు వెళ్ళింది పాకిస్థాన్. హఫీజ్ వ్యక్తిగత ఖర్చులకు డబ్బులు ఇప్పించాలని ఐరాస ని కోరింది. దీనిపై సభ్య దేశాలు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఐరాస కూడా అంగీకరించింది. అతను ఖర్చుల కోసం నెలకి 1,50,000 పాకిస్థాన్ కరెన్సీ డ్రా చేసుకోవడానికి సమ్మతించింది.
అంతేకాకుండా పాకిస్థాన్ తన మత పిచ్చిని మరొకసారి బయటపెట్టింది. ఎప్పుడు చూసినా భారత్ లో ముస్లింలకు స్వేచ్ఛ లేదని - అక్కడ ముస్లింలను అణచివేస్తున్నారని పిచ్చ కుక్కలా మొరిగే పాకిస్థాన్ తన మత పిచ్చిని మరొకసారి పాకిస్థాన్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. పాకిస్థాన్ లో ముస్లిమేతరులు కూడా అధ్యక్ష పదవులు చేపట్టేందుకు వీలుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన క్రిస్టియన్ ఎంపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును పాకిస్థాన్ ప్రభుత్వం అడ్డుకుంది. పాకిస్థాన్ ఇస్లామిక్ దేశమని, తమ దేశంలో అధ్యక్షా - ప్రధాని లాంటి పదవులు కేవలం ముస్లింలు మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది.