Begin typing your search above and press return to search.
షాకింగ్ : పాక్ లో క్వారంటైన్ టైం 48 గంటలే అంట !
By: Tupaki Desk | 13 May 2020 10:10 AM GMTప్రపంచాన్ని భయంతో వణికిపోయేలా చేస్తున్న ఈ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తూపోతుంది. ఇప్పుడు ఈ వైరస్ దెబ్బకి పాక్ గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో 32 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా..సుమారుగా 700 మందికి పైగా మరణించారు. ఒకవైపు ఉగ్రవాదంతో అల్లాడుతున్న ఆ దేశం ఈ మహమ్మారి దెబ్బకు కుదేలైంది. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి - ఈ వైరస్ మరో గుదిబండలా మారింది. అలాగే పాక్ లో సరైన మెడికల్ వ్యవస్థ లేదు...కనీసం పీపీఈ కిట్లను అందించే స్థోమత ఉండటం లేదు.
ఇలాంటి క్లిష్ట సమయంలో ఉన్న పాక్ కు ఇండియా కొన్ని రకాల మెడిసిన్స్ ను సప్లై చేసింది. మెడిసిన్ తయారు చేసుకునే ముడి పదార్దాలను ఇండియా ఆ దేశానికీ ఎగుమతి చేస్తున్నది. పూల్వమా దాడి తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై నిషేధం విధించింది పాక్. దీంతో ఆ దేశంలో మందుల కొరత రావడంతో మెడిసిన్స్ దిగుమతి లో కొన్ని సడలింపులు ఇచ్చి దిగుమతి చేసుకుంటోంది.
ఈ విషయం ఇలా ఉంటే ... అన్ని దేశాల్లో ఈ మహమ్మారి కారణంగా క్వారంటైన్ కు పంపించే రోజుల సంఖ్య కనీసం 14 నుంచి 28 రోజుల వరకు ఉంటుంది. కానీ, పాక్ మాత్రం దానిని పక్కన పెట్టి క్వారంటైన్ సమయం కేవలం 48 గంటలు మాత్రమే గా నిర్ణయించింది. 48 గంటల తరువాత మెడికల్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కు పంపుతారు. నెగటివ్ వస్తే ఇంటికి పంపుతారు. ప్రస్తుతం కొనమని దేశాల్లో 14 రోజులుంటేనే ఈ వైరస్ బయటపడటం లేదు. అలాంటిది కేవలం 48 గంటలు మాత్రమే క్వారంటైన్ అంటే అసలు ఊహించడానికే కష్టం. ఇది కోరి కష్టం పెద్దది చేసుకుంటున్నట్టే అవుతుంది.