Begin typing your search above and press return to search.

నవాజ్.. ముషార్రఫ్ తో రొమాన్స్ చేసిందట

By:  Tupaki Desk   |   22 July 2016 4:40 AM GMT
నవాజ్.. ముషార్రఫ్ తో రొమాన్స్ చేసిందట
X
సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. పాకిస్థాన్ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా కరాచీకి చెందిన ఆస్మా అనే యువతి తాను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇద్దరితో రొమాన్స్ చేశానని చెప్పింది. వారిద్దరూ తనతో రొమాన్స్ చేసినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. ఆధారాలు లేకుండా తాను మాట్లాడటం లేదని స్పష్టం చేసిన ఆమె మాటలు ఇప్పుడా దేశంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పాక్ లోని హెచ్ టీవీలో ‘‘వసీం బిర్యానీ షో’’ పేరిట ఒక ప్రోగ్రామ్ కు మంచి పేరుంది. ఈ షోలో పాల్గొన్న సదరు యువతి సంచలన విషయాల్ని చెప్పుకొచ్చింది.

ముషార్రఫ్ తనను విందుకు పిలవటమే కాదు.. తనతో రొమాన్స్ చేసిన విషయాన్ని కాస్త సిగ్గు పడుతూనే వెల్లడించింది. నవాజ్ కూడా తనతో సరసాలు ఆడటంతో పాటు.. తన ఫోన్ నెంబరు తెలుసుకోవాలని ఆరాటపడ్డారని చెప్పిన ఆమె.. నవాజ్ తనకోసం ఎంతగా తపించింది ఆమె చెబుతూ.. ‘‘నా వైపు అలా చూస్తూ ఉండేవారు. నేనేం చేస్తానని అడిగారు. తాను ఇస్లామాబాద్ లో ఉంటానని చెప్పారు. ఒక రోజు మేం మాట్లాడుకున్నాం. మాటల మధ్యలో సాయంత్రం ఏం చేస్తావని అడిగారు. తానేమీ ప్లాన్ చేసుకోలేదని చెప్పా. దాంతో సాయంత్రం తనతో డిన్నర్ కి రావొచ్చు కదా అని అడిగారు. ఇద్దరం కలిసి బిజినెస్ క్లాస్ జర్నీ కూడా చేశాం’’ అని వెల్లడించింది.

నవాజ్ మాత్రమే కాదని ముషార్రఫ్ కూడా తనతో రొమాన్స్ చేశారని.. ఆయనతో రొమాన్స్ అదో ప్రత్యేకమైన అనుభూతిగా ఆస్మా పేర్కొంటూ.. ముషార్రఫ్ రొమాంటిక్ అని.. షరీఫ్ రొమాంటిక్ కాదన్నారు. ముషార్రఫ్ సరసాలాడే తీరు ఎంతో బాగుంటుందని.. అది తనకు నచ్చుతుందని చెప్పిన ఆస్మా.. తనకు ముషార్రఫ్ స్టైల్ ఎంతో ఇష్టమని.. ఆయన వ్యక్తిత్వం అంటే పడి చస్తానని చెప్పేసింది. అమ్మడు చెప్పటం అయ్యింది.. ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన దుమారం ఎంతవరకూ వెళుతుందో..?