Begin typing your search above and press return to search.

అజిత్ ధోవల్ పై పాకిస్తాన్ అక్కసు

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:20 PM GMT
అజిత్ ధోవల్ పై పాకిస్తాన్ అక్కసు
X
భారత్ పై మరోసారి పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ లో చెలరేగిపోతున్న నిరసనల వెనుక భారత్ ఉందని ఆరోపిస్తోంది. తమ దేశంపై తిరుగుబాటు చేయడానికి అమాయక బలూచిస్తాన్ గిరిజనులను భారత్ ప్రోత్సహిస్తోందని పాక్ విమర్శించింది. దీనంతటికి కారణం భారత్ జాతీయ సలహాదారు అజిత్ ధోవల్ అని పాకిస్తాన్ ఆరోపించింది.

పాకిస్తాన్ వైమానిక దళ మాజీ అధికారి, రిటైర్డ్ వైస్ మార్షల్, కాలమిస్ట్ షెహజాద్ చౌదరి తాజాగా ఓ వెబ్ సైట్ కు రాసిన ఆర్టికల్వైరల్ అయ్యింది. ‘అజిత్ దోవల్.. డర్టీ వార్’ పేరుతో ఈ కథనం వెలువడింది. తెహ్రిక్ తాలిబన్ (టీటీపీ), బలూచిస్తాన్ ఆర్మీ(బీఎల్ఏ), ‘రా’లను కలిపి ఏకం చేసి అజిత్ ధోవల్ పాకిస్తాన్ పై ఎగదోస్తున్నారని ఆరోపించారు.

కశ్మీర్ అంశం నుంచి పాకిస్తాన్ దృష్టిని మరల్చేందుకు ఈ కుట్ర పన్నారని షెహజాద్ చౌదరి భారత్ పై తీవ్రఆరోపణలు చేశారు. కశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేయడం వెనుక అజిత్ ధోవల్ హస్తం ఉందని ఆరోపించారు. అజిత్ చెప్పినట్టుగా భారత ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.

కాశ్మీర్‌కు సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్నయినా భారత ప్రభుత్వం.. అజిత్ దోవల్‌ను సంప్రదించే తీసుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఇదివరకే కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.