Begin typing your search above and press return to search.

డాన్ చానల్ లో భారత జెండా రెపరెపలు

By:  Tupaki Desk   |   3 Aug 2020 6:15 AM GMT
డాన్ చానల్ లో భారత జెండా రెపరెపలు
X
పాకిస్థాన్ ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన డాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ మీడియా సంస్థకు చెందిన చానల్ ప్రసారాల మధ్యలో ఉన్నట్లుండి భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. అంతేనా.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ అక్షరాలు కనిపించటంతో సదరు చానల్ సిబ్బందికి మాత్రమే కాదు.. టీవీలో కార్యక్రమాన్ని చూస్తున్న వీక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకిలా జరిగింది? ఎవరు దీనికి కారణం అన్నది ప్రశ్నగా మారింది.

డాన్ టీవీ చానల్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి కారణం హ్యాకర్లు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ - పాక్ హ్యాకర్ల మధ్య భారీ ఎత్తున ఆన్ లైన్ లో యుద్ధం జరుగుతుందని చెబుతున్నారు. తమ మేథోశక్తితో పాక్ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిందే డాన్ చానల్ లో భారతీయ త్రివర్ణ పతాకం ఎగరటం.

ఈ పరిణామంపై డాన్ మీడియా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పాకిస్థాన్ కాలామానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డాన్ చానల్ లో భారతీయ జెండా ఎగిరినట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి కారణం తామేనంటూ ఎవరూ క్లెయిం చేసుకోలేదు.