Begin typing your search above and press return to search.

50 ఏళ్ల పాక్ ఎంపీకి 14 ఏళ్ల బాలికతో పెళ్లి

By:  Tupaki Desk   |   24 Feb 2021 6:30 AM GMT
50 ఏళ్ల పాక్ ఎంపీకి 14 ఏళ్ల బాలికతో పెళ్లి
X
పాకిస్తాన్ లో మరో దారుణం జరిగింది. అక్కడ జరిగే నిత్యకృత్యాలు ఇన్నాళ్లు బయటకు తెలిసేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక ఏ దారుణాలైనా ప్రపంచానికి ఇట్టే తెలుస్తున్నాయి.

తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన ఓ ఎంపీ 14 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు, అతడి ఫొటోలు బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదురు ఎంపీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

మియత్ ఉలేమా ఏ ఇస్లాం నేత, పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50ఏళ్ల ఎంపీ.. బలూచిస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆ బాలిక 2006, అక్టోబర్ 28న జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం ఆ ఎంపీ.. 14 మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్లు తేలింది.

పాకిస్తాన్ చట్టాల ప్రకారం.. 16 ఏళ్ల కంటే తక్కువ యవసున్న వారి వివాహం చెల్లదు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

దీనిపై స్తానిక మహిళా సంక్షేమ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగతంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికతో ఎంపీ వివాహంపై విచారణ జరిపించారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని.. తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.