Begin typing your search above and press return to search.

లంక క్రికెటర్లను బెదిరిస్తున్న భారత్: పాక్

By:  Tupaki Desk   |   11 Sep 2019 1:30 AM GMT
లంక క్రికెటర్లను బెదిరిస్తున్న భారత్: పాక్
X
పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం. ఆ దేశంలో పర్యటించిన పాపానికి 2009లో లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ క్రికెట్లు బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. 2009 తర్వాత ఏ దేశం పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. క్రికెటర్ల ప్రాణాలు పోయింటే పాకిస్తాన్ కు ఇంకా చెడ్డ పేరు వచ్చి ఉండేది.

అయితే శ్రీలంక క్రికెటర్లపై పాకిస్తాన్ లో ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఆదేశంలో పర్యటించేందుకు ఏ పర్యాటక జట్టు కూడా ఇప్పటికీ సాహసించడం లేదు. తాజాగా ఈనెల 27 నుంచి శ్రీలంక జట్టు తమ దేశంలో మ్యాచ్ లు ఆడేలా పాకిస్తాన్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే పాకిస్తాన్ లో కాల్పులను దృష్టిలో పెట్టుకొని పాక్ పర్యటనకు వెల్లేందుకు శ్రీలంక క్రికెటర్లు విముఖత చూపిస్తున్నారు.

తాజాగా శ్రీలంక జట్టును పాక్ లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పించింది. కరాచీలో 27నుంచి మూడు వన్డేలు.. లాహోర్ లో మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్ రూపొందించింది. కానీ పాకిస్తాన్ లో పర్యటించేందుకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు లసిత్ మలింగ - ఏంజిలో మాథ్యూస్ - దిముత్ కరుణరత్నె తదితరులు నో చెప్పారు. దీంతో ఈ పర్యటనపై సందిగ్ధం నెలకొంది.

ఈ వివాదాన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మలుచుకొని భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్ లో పర్యటిస్తే ఐపీఎల్ లో ఆడించబోమని శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోందంటూ తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ మంత్రి ఫవాద్ చౌదరి ఆరోపించారు. భారత్ బెదరించిందని తనకు కొంతమంది మ్యాచ్ కామెంటేటర్లు చెప్పారని.. భారత్ చౌకబారు బెదిరింపులను అందరూ తీవ్రంగా ఖండించాలని ఫవాద్ చౌదరి మండిపడ్డారు.

ఇలా ఉగ్రవాద పాకిస్తాన్ తన దేశంలోని ఉగ్రవాదులను కంట్రోల్ చేయకుండా క్రికెటర్ల ప్రాణాలకు కూడా రక్షణ కల్పించకుండా ఉంటూ శ్రీలంక క్రికెటర్లు పర్యటనకు రాకుంటే ఆ నెపాన్ని భారత్ పై నెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి నాటకాలు మొదులు పెట్టింది. ఈ విమర్శలను భారత్ క్రికెట్ ఫ్యాన్స్, మాజీలు తప్పుపడుతున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తమపై నిందలా అని మండిపడుతున్నారు.