Begin typing your search above and press return to search.

అమెరికాలో దిగనున్న పాక్ లాబీయిస్ట్ లు

By:  Tupaki Desk   |   15 Jun 2016 8:00 AM GMT
అమెరికాలో దిగనున్న పాక్ లాబీయిస్ట్ లు
X
లాబీయింగ్ అన్న మాట మన దగ్గర అదో పెద్ద తప్పుగా చూస్తారు కానీ.. ఆగ్రరాజ్యమైన అమెరికాలో దాన్నో గౌరవనీయమైన వృత్తిగా భావిస్తారు. నిజానికి ఆ దేశంలో ఏం జరగాలన్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా లాబీయింగ్ ప్రధానంగా ఉంటుంది. ఈ మధ్యన అమెరికాను సందర్శించిన సందర్భంగా భారత్ ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించటం వెనుక కూడా లాబీయిస్ట్ కృషి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా.. అమెరికాలో జరిగే ప్రతి విషయంలోనూ లాబీయిస్ట్ ల పాత్ర ఎక్కువగా ఉంటుంది.

గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో భారత్ తరఫున బలమైన లాబీయింగ్ నడుస్తోంది. అదే సమయంలో మన దాయాది పాక్ మాత్రం లాబీయిస్ట్ ల సేవల్ని తీసుకోవాటానికి సుముఖంగా లేదు. కొన్నేళ్లుగా పాక్ తరఫున అమెరికాలో ఎలాంటి లాబీయింగ్ జరగని పరిస్థితి. దీని కారణంగా ఈ రెండు దేశాల మధ్య నానాటికీ దూరం పెరిగిపోతుందన్న విషయాన్ని పాకిస్థాన్ గుర్తించింది. దీన్ని సరిదిద్దుకోవటానికి తన తరఫు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసేందుకు పాక్ లాబీయిస్ట్ ల సహకారం తీసుకోనుందని చెబుతున్నారు

ఇటీవల కాలంలో ఎఫ్ 16 యుద్ధ విమానాల విషయంలో పాక్ కోరికను భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటంతో పాటు.. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ తాలిబన్ నేత ముల్లా అక్తర్ మన్సూర్ ను అమెరికా యుద్ధ విమానదాడిలో మరణించటంపై అమెరికా పట్ల పాక్ కినుకుగా ఉంది. ఇలా రెండు దేశాల మధ్య పలు అంశాల్లో దూరం పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ దూరాన్ని లాబీయిస్ట్ ల సాయంతో తగ్గించాలన్నది పాక్ ఆలోచనగా చెబుతున్నారు. భారత్ మాదిరి లాబీయింగ్ లో పాక్ కూడా దూసుకుపోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.