Begin typing your search above and press return to search.
పైలెట్ విడుదలకు షరతులు.. భారత్ గట్టి వార్నింగ్
By: Tupaki Desk | 28 Feb 2019 10:06 AM GMTపాకిస్థాన్ మరోమారు తన కుయుక్తులు కొనసాగిస్తోంది. తమకు చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ను భారత్ కు తిరిగి అప్పగించడానికి పాకిస్థాన్ మెలికలు పెడుతోంది. ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నది. అయితే ఈ డిమాండ్లకు భారత్ అంగీకరించడం లేదు. ఏ డీలూ లేదు.. వెంటనే మా పైలట్ ను విడుదల చేయండి అని భారత్ స్పష్టం చేసింది. కాందహార్ సమయంలోలాగే ఇప్పుడూ భారత్ పై పాకిస్థాన్ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని, అయితే దీనికి భారత్ తలొగ్గే పరిస్థితుల్లో లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి చర్చలు లేదా ఒప్పందాలకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ వెల్లడించారు. యుద్ధ ఖైదీ హోదాలో విడుదల చేయాలా? లేదా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆధీనంలో ఉన్న అభినందన్ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాడని స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తమ భూభాగంలో అభినందన్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యాడని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత అభినందన్ ను ఇండియాకు అప్పగిస్తామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహముద్ ఖురేషి వెల్లడించారు. పైలట్ అప్పగింత విషయంలో పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నామని ఖురేషి అన్నారు. ఒక వేళ భారత ప్రధాని మోదీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. యుద్ధం జరిగితే పాక్ కే నష్టం జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాదా? అని ఖురేషి ప్రశ్నించారు.
కాగా, ముంబై, పఠాన్ కోట్ లపై దాడుల సమయంలోనూ పాకిస్థాన్ కు పూర్తి ఆధారాలు ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈసారి అలాంటి ఆధారాలేవీ పాక్ కు ఇచ్చే ప్రసక్తే లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. గతంలో ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నాం. వాటికి సంబంధించిన ఆడియోలూ ఇచ్చాం. అయినా పాకిస్థాన్ మాత్రం నిరాకరిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పుల్వామాలో జైషే మహ్మద్ పాత్రను పాక్ అంగీకరించడం లేదు అని భారత్ అభిప్రాయపడింది. కర్తార్ పూర్ పై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ పాకిస్థాన్ ఆ చర్చలను రద్దు చేసింది. ఇప్పుడు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. విమానాలను, సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసింది అని భారత్ ఆరోపించింది. జైషే మహ్మద్, ఇద్దరు పైలట్లు కస్టడీలో ఉన్నారన్న అంశాలపై అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. భారత్ నౌకలపై అబద్ధం చెప్పారు. మిస్సైల్ దాడులపై అబద్ధం చెప్పారు అని భారత్ విమర్శించింది.