Begin typing your search above and press return to search.

అవినీతిలో పాకిస్తాన్ ఘోరం.. భారత్ స్థానం ఎంతంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:06 PM IST
అవినీతిలో పాకిస్తాన్ ఘోరం.. భారత్ స్థానం ఎంతంటే?
X
ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్ మరింత దిగజారిపోయింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల జాబితాను విడుదల చేస్తే అందులో పాకిస్తాన్ దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. బెర్లిన్ కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ ఈ జాబితాను విడుదల చేసింది.

గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ జాబితాలో 180 దేశాలకు 100 మార్కుల వరకూ ఇచ్చారు. ఈ జాబితాలో 28 మార్కులతో పాకిస్తాన్ ప్రపంచంలో 140వ స్థానంలో నిలిచింది.

ఇక భారత దేశం 40 మార్కులతో 85వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ కంటే ఘోరంగా బంగ్లాదేశ్ 147వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషించింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి.

ఇక ప్రపంచంలోనే భారీ అవినీతి మయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అప్ఘనిస్తాన్ దేశాలున్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉంది. మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది.