Begin typing your search above and press return to search.
పాక్ అణుబాంబులు స్థాయి అది.....
By: Tupaki Desk | 29 Aug 2015 12:13 PM ISTపాకీ-స్థాన్...నిరంతరం వార్తల్లో నిలిచే ఈ దేశం మరోమారు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. అది కూడా ఎప్పట్లాగే తన పనికిమాలిన నీచ ప్రయత్నంతో. అణుశక్తిని సంపాదించిన దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానం పాకిస్థాన్ దేనని తేలింది. అణుబాంబులు కలిగి ఉన్న దేశాల వరుసలో త్వరలోనే పాక్ మూడో స్థానంలో రాబోతుందని అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది.
పాకీ-స్థాన్ దాదాపు ఏడాదికి 20 అణుబాంబులు తయారు చేస్తుందని ఆ కథనంలో వాషింగ్టన్ పేర్కొంది. ఈ బాంబులు తీవ్ర విస్పోట శక్తిని కలిగిఉన్నాయని కూడా ఆ కథనం వివరించింది. అంతర్జాతీయ సమాజం అణు సంస్కృతికి దూరంగా ఉండాలని కోరుతున్నా..పాక్ ఈ రకంగా వ్యవహరించడం ఆ దేశ బుద్ధిని చాటుతోంది. మొత్తంగా వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్న అమెరికా, రష్యాల సరసన త్వరలోనే పాక్ చేరబోతుంది.
ఇదిలా ఉంటే...అంతర్జాతీయ సరిహద్దు సమీప గ్రామాలు, భారత బలగాల శిబిరాలపై పాక్ దళాలు మోర్టార్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజాగా జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా 17మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని బారత్ తీవ్రంగా ఖండించగా...తమది అణ్వస్త్ర దేశమన్న సంగతి మరచిపోవద్దంటూ పాక్ ఎన్ ఎస్ ఏ సర్తాజ్ అజీజ్ భారత్‌ను హెచ్చరించారు.