Begin typing your search above and press return to search.
కులభూషణ్ భార్యతో మంగళసూత్రం తీయించిన పాక్
By: Tupaki Desk | 26 Dec 2017 6:24 PM GMTపాకిస్థాన్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను అతని తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్ కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇవాళ వారిద్దరూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. ఎలాగైనా పాక్ చెర నుంచి కుల్‌భూషణ్‌ను విడిపించాలని సుష్మాను కోరారు. అందుకోసం తాను చేయగలిగింది తాను చేస్తానని సుష్మా వారికి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు పలుమార్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరిపిన సుష్మా స్వరాజ్ వారికి కుల్ భూషణ్ ని కలిసే అవకాశం కల్పించారు. అలాగే, మరోసారి కూడా కుల్‌భూషణ్‌ని కలిసే అవకాశాన్ని కల్పిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వీరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క, చర్చలు సఫలమైతే కుల్‌భూషణ్‌ని విడిపించే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు.
కాగా... కులభూషణ్‌ను ఆయన తల్లి, భార్య కలిసినప్పుడు పాకిస్థాన్ వ్యవహరించిన తీరుపై అంతా మండిపడుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న అవగాహనకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగిందట. 'భద్రతా కారణాలంటూ వాళ్లతో దారుణంగా వ్యవహరించారు. వాళ్ల మత, సాంప్రదాయాలకు కనీస విలువ ఇవ్వలేదు. కుల్‌భూషణ్ భార్య మంగళసూత్రం, గాజులు, బొట్టు తీయించారు. భద్రతకూ దీనికీ సంబంధం ఏంటి?' అని పాకిస్తాన్‌ను ఇండియా నిలదీసింది.
అంతేకాదు.. వాళ్లను కనీసం మాతృభాషలో మాట్లాడనివ్వలేదని, పదేపదే అడ్డుపడ్డారని ఆరోపించింది. సమావేశం తర్వాత జాదవ్ భార్య చెప్పులు కూడా తిరిగి ఇవ్వలేదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చనే అనుమానం తమకు ఉందని.. భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. కుల్‌భూషణ్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని, నిర్బంధంలో ఉన్నట్లుగా ఆయన మాట్లాడారని, జాదవ్ పరిస్థితి చూస్తుంటే.. ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్లు అనిపించలేదని అనుమానం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో తాను విద్రోహ చర్యలకు పాల్పడినట్లుగా బెదిరించి ఆయనతో చెప్పించినట్లు తెలుస్తోందని రవీష్ స్పష్టంచేశారు.