Begin typing your search above and press return to search.
ప్రతిచర్య తప్పదు... మేం దేనికైనా రెడీ!
By: Tupaki Desk | 20 Sep 2016 6:30 AM GMTయూరి ఆర్మీ స్థావరం పై ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ ప్రమేయం పైన ఆధారాలను బయటపెట్టేపనిలో సైన్యం బిజీగా గడిపింది. ఇదే సమయంలో దాడికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిందని - గాలింపు చర్యలు పూర్తి చేశామని, దాడి పైన డిజిఎంవో లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఈమేరకు ఆధారాలు వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి రెండు రేడియో సెట్లు - రెండు జిపిఎస్ సెట్లు స్వాధీనం చేసుకున్నామని.. గ్రెనేడ్స్ పాయింట్లుగా వాడే మ్యాప్ షీట్లు - మెట్రిక్ షీట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఇదే సందర్భంలో నాలుగు ఏకే 47 - గ్రెనెడ్ లాంఛర్లు - 39 అండర్ బ్యారెల్ గ్రెనెడ్ లాంఛర్స్ - ఐదు హ్యాండ్ గ్రెనెడ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు రణబీర్ సింగ్ తెలిపారు. మేడిన్ పాక్ ముద్రతో మందులు - ఆహార పదార్ధాలు కూడా ఉగ్రవాదుల వద్ద లభ్యమయ్యాయని.. గతంతో పోలిస్తే ఈ ఏడాది చొరబాట్లు పెరిగాయని ఆయన చెప్పారు. భారత్ లక్ష్యంగా జరిగే దాడుల పైన ప్రతి చర్యలకు దిగాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని చెప్పిన లెఫ్టినెంట్ జనరల్.. పాక్ పైన ప్రతిచర్య తప్పదని అన్నారు.
మరోపక్క పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి.. అవి పాక్ రక్షణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నామని.. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం ఎప్పుడూ సిద్దమే అని, దేనికైనా తాము రెడీగా ఉన్నామని వ్యాఖ్యానించారు.
కాగా... జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న దారుణ పరిణామాలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఆడిన ఆట అని.. పాక్ పై భరత ఆరోపణలు బాధ్యతారహితంగా చేసినవని ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.