Begin typing your search above and press return to search.

పాక్ మాట‌తో అర‌బ్ దేశాల రియాక్ష‌న్ ఏంది?

By:  Tupaki Desk   |   27 Feb 2019 11:09 AM GMT
పాక్ మాట‌తో అర‌బ్ దేశాల రియాక్ష‌న్ ఏంది?
X
దాయాది దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌లు యుద్ధం దిశ‌గా అడుగులు వేస్తున్నాయా? అన్న సందేహం అంద‌రి మ‌న‌సుల్ని తొలిచేస్తున్న వేళ‌.. పాక్ మ‌రో అడుగు ముందుకేసింది. అర‌బ్ దేశాల ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆప‌రేష‌న్ పొట్టిగా చెప్పాలంటే ఓఐసీ స‌ద‌స్సును ఏర్పాటు చేసింది. దీనికి విశిష్ఠ అతిధిగా భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఆహ్వానం పంపింది.

గ‌డిచిన రెండు రోజులుగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో తాము సుష్మ వ‌చ్చేట‌ట్లైయితే.. స‌ద‌స్సుకు రామంటూ పాక్ విదేశాంగ మంత్రి మొహ్మ‌ద్ ఖురేషీ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి స‌మాచారం అందించారు.భార‌త్ పేరు చెప్పి.. త‌మ స‌ద‌స్సుకు రామ‌ని చెప్ప‌టంపై స‌ద‌రు స‌ద‌స్సు ఎలా రియాక్ట్ అవుతుంద‌న్ని ఆస‌క్తిక‌రంగా మారింది.

భార‌త్ బూచి చూపించి స‌ద‌స్సుకు రాన‌ని చెబుతున్న పాక్ తీరు అర‌బ్ దేశాల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తుందా? వారెలా స్పందిస్తారు అన్న‌ది ప్ర‌శ్న అయితే.. క‌య్యానికి కాలు దువ్వేలా పాక్ తాజా నిర్ణ‌యం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఇక ఐఓసీ విష‌యానికి వ‌స్తే.. ఒక ర‌కంగా ఈ సంస్థ పాక్ కు కాసింత అనుకూల‌మ‌ని చెప్పాలి. ఇందులో మొత్తం 57 స‌భ్య దేశాలు ఉన్నాయి.

ఈ స‌ద‌స్సులో అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాకిస్థాన్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌శ్మీర్ అంశాన్ని లేవ‌నెత్తుతూ ఉండ‌టం.. దానికి భార‌త్ ప‌లుమార్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం చేసేది. క‌శ్మీర్ పై ఐఓసీ పాక్ వాద‌న‌కు పాజిటివ్ గా ఉంటుంద‌న్న మాట ఉంది. అయితే.. భార‌త్ విదేశాంగ మంత్రి పేరుతో తాము రామ‌ని చెప్ప‌టం అర‌బ్ దేశాల‌కు కాలేలా చేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.