Begin typing your search above and press return to search.
పాక్‌కే ఆందోళన కలిగించేలా మాట్లాడాడు
By: Tupaki Desk | 24 May 2015 9:24 AM GMTమాటలతో తెగబడటం పాకిస్థాన్‌కు మామూలే. భారత్ విషయంలో బాధ్యతరాహిత్యంతో మాట్లాడటం.. పెడసరంగా బదులివ్వటం.. శాంతిభద్రతల్ని ప్రభావితం చేసేలా వ్యవహరించటం మామూలే. అలాంటి పాకిస్థాన్ సైతం.. తాజాగా ఆందోళన పడేలా వ్యవహరించటం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కే చెల్లింది.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌కు సైతం గుబులు పుట్టించేలా పారికర్ వ్యాఖ్యలు చేశారంట. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేమంటే.. తీవ్రవాదులను తీవ్రవాదులతోనే సెట్ చేయాలంటూ ఆయన కాస్తంత నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దేశ రక్షణ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు వీలైనంతవరకూ ఆచితూచి మాట్లాడటం మాత్రమే ఉన్న వైఖరిని భిన్నంగా.. పారికర్ కాస్తంత దూకుడుగా మాట్లాడటం పాక్‌కు ఓ పట్టాన అర్థం కావటం లేదు.
భారత్‌తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. తీవ్రవాదం రెండు దేశాలకు శత్రువు అంటూ పాకిస్థాన్ జాతీయ భద్రత.. విదేశీ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత రక్షణ మంత్రి లాంటి వ్యక్తి నోటి నుంచి తాము ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోవటం లేదని ఆయన ముక్తాయిస్తున్నారు. పాక్‌కు అర్థమయ్యే భాషలో చెప్పే రక్షణ మంత్రి ఇన్నాళ్లకు వచ్చాడన్న మాట.