Begin typing your search above and press return to search.

మోదీని మళ్లీ గెలిపించకపోతే పాకిస్తాన్ భారత్‌ ను ఓడించేస్తుంది

By:  Tupaki Desk   |   4 March 2019 1:54 PM GMT
మోదీని మళ్లీ గెలిపించకపోతే పాకిస్తాన్ భారత్‌ ను ఓడించేస్తుంది
X
ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టి - లేనిపోని భయాలు కల్పించి రాజకీయ ప్రయోజనాలు పొందడంలో బీజేపీ నేతలను మించినోళ్లే లేరు. తాజాగా అస్సాంకు చెందిన బీజేపీ నేత ఆ రాష్ట్ర ప్రజలను భయపెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోకపోతే దేశం నాశనమైపోతుందని.. పాకిస్తాన్ మనపై దాడి చేస్తుందని ఆయన అన్నారు.

అస్సాంలో కీలక బీజేపీ నేత - ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో దేశంలోనూ - రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే పాకిస్థాన్ ఆర్మీ లేదా ఉగ్రవాదులు ఇండియన్ పార్లమెంట్ - అస్సాం అసెంబ్లీపై దాడి చేస్తారు’’ అన్నారు.

బీజేపీ ప్రభుత్వం రాకపోతే, మోదీ ప్రధాని కాకపోతే పాకిస్తాన్ రెచ్చిపోతుందని.. ఆ దేశాన్ని అప్పుడు ఎదుర్కోలేమని.. కాబట్టి అస్సాంలో - దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపించుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్‌ కు అనుకూలంగా సోషల్ మీడియలో పోస్టులు పెట్టిన 130 మందిపై కేసులు పెట్టినట్లు చెప్పారు. శత్రుదేశానికి మద్దతిచ్చే ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులు పుట్టడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. పాకిస్తాన్‌ కు జిందాబాద్ కొట్టే వారికి కళ్లెంపడాలంటే మోదీ మళ్లీ ప్రధాని కావాలని హిమంత పిలుపునిచ్చారు.

కాగా హిమంత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నుంచి విమర్శలు వస్తుండగా బీజేపీ మాత్రం ఈ కాన్సెప్ట్‌ ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించడానికి రెడీ అవుతోందట.