Begin typing your search above and press return to search.
నటుడు దిలీప్ కుమార్ ఇంటిపై ‘పాకిస్థాన్’ కుట్రలు... ఇంతకీ ఏమిటా స్టోరీ..!
By: Tupaki Desk | 7 Feb 2021 7:30 AM GMTబాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ పూర్వీకులు పాకిస్థాన్ కు చెందినవారు. దేశ విభజనకు ముందు వాళ్లు పాకిస్థాన్ లో ఉండేవారు. అయితే పాకిస్థాన్ లోని ఖైబర్ పక్తున్క్వా ప్రాంతంలో వాళ్లకు ఓ ఇళ్లు ఉంది. ఈ ఇంటిని 15 ఏళ్ల క్రితం హజీ లాల్ మహ్మద్.. 15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇంటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 25 కోట్లు ఉంది. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం దీన్ని ఎలాగైన స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది.
ఇందుకోసం ఈ ఇంటిని వారసత్వ కట్టడంగా గుర్తించింది. ప్రస్తుతం ఆ ఇంటి యజమాని హజీ లాల్ మహ్మద్ కు రూ. 80.56 లక్షలు మాత్రం చెల్లించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘నేను 15 ఏళ్ల క్రితం ఈ ఇంటిని రూ. 50 లక్షలకు కొంటే ఇప్పుడు రూ. 80 లక్షలు మాత్రమే చెల్లించడం కుట్ర. ప్రభుత్వం తక్కువ ధరకే ఈ ఇంటిని కొనేందుకు కుట్రలు చేస్తున్నది’ అంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి ఈ భవంతిని అమ్మే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్ కట్టడంగా పాక్ గుర్తించింది. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ ఇంటిపై ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే దిలీప్ కుమార్ కట్టడాన్ని హెరిటేజ్ కట్టడంగా గుర్తించడం పట్ల మొదట్లో పలువురు హర్షించారు. అయితే ఇప్పడు యజమాని ఆరోపణలతో ఈ భవంతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భవనానికి తక్కువ ధర చెల్లించేందుకే పాక్ హెరిటేజ్ కట్టడం అని అంటున్నదని ఆ ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు.