Begin typing your search above and press return to search.

అమెరికా 9/11 దాడుల కుట్ర మాదే: ఇమ్రాన్

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:23 AM GMT
అమెరికా 9/11 దాడుల కుట్ర మాదే: ఇమ్రాన్
X
పాకిస్తాన్ పడగ విప్పిన విషనాగు అని ఎట్టకేలకు ప్రపంచదేశాలకు అర్థమైంది. అమెరికా-భారత్ చెలిమితో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టి దుమారం రేపారు. హుస్టన్ లో ట్రంప్-మోడీ కలిసికట్టుగా చేసిన సభను చూశాక ఇమ్రాన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఎంతమాత్రం అమెరికా తమకు మిత్రదేశం కాదని క్లారిటీకి వచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఓ సంచలన విషయాన్ని తాజాగా బయటపెట్టారు.

తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ అక్కడ అమెరికన్ మేథోబృందం-విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్ఆర్)లో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాపై 9/11 ఉగ్రవాద దాడుల కోసం అల్ కాయిదా ఉగ్రవాదులకు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చింది నిజమేనని సంచలన విషయం చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 11 2001 దాడులకు ముందు అల్ కాయిదా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ శిక్షణ ఇచ్చాయని ఇమ్రాన్ బాంబు పేల్చారు.

అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఉగ్రవాదానికి సహకరించడం లేదని.. కానీ సైన్యం మాత్రం మారలేదని ఇమ్రాన్ తమ దేశంలో జరుగుతున్న వ్యవహారాలను ప్రపంచదేశాల ముందు కుండబద్దలు కొట్టారు. ఇక 9/11 దాడుల తర్వాత అమెరికాతో చేతులు కలిపి పాకిస్తాన్ అతిపెద్ద తప్పు చేసిందని ఇమ్రాన్ ఆడిపోసుకున్నారు. ఇప్పుడు భారత్ వైపు అమెరికా మళ్లిందని ఆక్రోషించారు.

లాడెన్ ను దాచింది కూడా పాకిస్తాన్ అని..కానీ అమెరికా గుర్తించి చంపేసిందని.. అమెరికాతో కలిసి సాగి తాము తమను తాము ముంచుకున్నామని ఇమ్రాన్ చెప్పుకున్నాడు.

ఇమ్రాన్ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్ర వాద దేశం అన్న భారత్ వాదనకు బలం చేకూరినట్టైంది. ఇప్పటికై అమెరికా సహా చైనా ఇతర దేశాలు పాకిస్తాన్ నిజస్వరూపాన్ని గ్రహించి ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని అందరూ కోరుతున్నారు.