Begin typing your search above and press return to search.
కలకలం.. పాక్ జలాల్లోకి భారత జలాంతర్గామి
By: Tupaki Desk | 5 March 2019 9:25 AM GMTభారత్-పాకిస్తాన్ మధ్య జమ్మూకాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగకముందే.. ఇప్పుడు జలయుద్ధం జరిగేలా కనిపిస్తోంది. తాజాగా గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ జలాల్లోకి మంగళవారం భారత జలాంతర్గామి ఒకటి ప్రవేశించడం కలకలం రేపింది.
తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత నౌకదళానికి చెందిన జలాంతర్గామి తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. గుజరాత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో జలాంతర్గామి ఉన్నట్టు తేల్చింది. ఆ జలాంతర్గామిని తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పాకిస్తాన్ నౌకదళ అధికార ప్రతినిధి విడుదల చేశారు.
భారత జలాంతర్గామి ఇలా పాకిస్తాన్ దేశ సముద్ర జలాల్లోకి చొరబాటుకు యత్నించడం గడిచిన మూడేళ్లలో ఇది రెండోసారి అని అధికార ప్రతినిధి తెలిపారు. తమ దేశ సముద్ర జలాల్లోకి వచ్చినప్పటికీ భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోలేదని.. దాన్ని తరిమి కొట్టామని తెలిపారు. భారత్ తో శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నందున తాము దానిపై దాడులు చేయలేదని తెలిపారు.