Begin typing your search above and press return to search.

పాక్ కు సెమీస్ ఛాన్స్ ఎంతుంది?

By:  Tupaki Desk   |   4 July 2019 9:23 AM GMT
పాక్ కు సెమీస్ ఛాన్స్ ఎంతుంది?
X
మ్యాచ్ ఏదైనా కానీ టీమిండియా చెల‌రేగి ఆడుతుంటే పాకిస్తాన్ క్రికెట్ అభిమాని చ‌ప్ప‌ట్లు కొట్టే అవ‌కాశం ఉందా? అంటే లేద‌ని చెబుతారు. కానీ.. ఎప్పుడూ లేని విధంగా టీమిండియా మ్యాచ్ గెల‌వాల‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఓడిపోకూడ‌దంటూ పాకిస్తానీయులు దండాల మీద దండాలు పెట్టిన ఉదంతం ఏదైనా ఉందంటే మొన్న ఇంగ్లండ్ తో టీమిండియా మ్యాచ్ జ‌రిగిన‌ప్పుడనే చెప్పాలి.

ఎందుకంటే ఆ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే పాకిస్తాన్ కు సెమీస్ కు చేరే అవ‌కాశం ఉంటుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే ఆ అవ‌కాశం మిస్ అవుతుంది. పాకిస్తానీయుల ప్రార్థ‌న‌లు ఫ‌లించ‌లేదు.. వారు కోరుకున్న‌ట్లు టీమిండియా ఆ మ్యాచ్ లో గెల‌వ‌లేదు.

దీంతో పాక్ జ‌ట్టుకు సెమీస్ బెర్త్ కు ఏ మాత్రం ఛాన్స్ లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తొమ్మిది మ్యాచుల్లో ఆరు విజ‌యాలు సాధించిన ఇంగ్లండ్ 12 పాయింట్ల‌తో సెమీస్ బెర్త్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోగా.. ఆసీస్.. టీమిండియాలు సెమీస్ కు అర్హ‌త సాధించాయి. సెమీస్ కు చేరే నాలుగో జ‌ట్టు మీద క్లారిటీ రాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ ఏదైనా అద్భుతం జ‌రిగి త‌మ జ‌ట్టు సెమీస్ కు చేరుకోవాల‌ని పాకిస్తానీయులు కోరుకుంటున్నారు.

నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అంటే ఉందంటున్నారు క్రీడా విశ్లేష‌కులు. ఇప్పుడు ప‌రిస్థితుల్లో పాక్ సెమీస్ కు చేరాలంటు మూడు ఆప్ష‌న్లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. ఆ ఆప్ష‌న్లు అన్నీ అసాధ్య‌మ‌న్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ పాక్ జ‌ట్టు ముందున్న ఆప్ష‌న్ల‌ను చూస్తే..

1. శుక్రవారం బంగ్లాతో జ‌రిగే మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్‌ చేసి పాక్జ‌ట్టు 350 పరుగులు సాధించాలి. 311 పరుగులతో గెలవాలి.

2. 400 పరుగులు చేసి 316 పరుగులతో గెలవాలి.

3. 450 పరుగులు చేసి 321 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి.