Begin typing your search above and press return to search.
డేంజర్: భారత్ లో పాకిస్తాన్ సెల్ ఫోన్ సిగ్నల్స్
By: Tupaki Desk | 16 April 2021 2:30 AM GMTభారత్ తో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్ ప్రతీసారి భారత్ ను దొంగదెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతూనే ఉంటోంది. తాజాగా మరోసారి ఆ పనికి పాల్పడింది. భారత్ లో మరోసారి పాకిస్తాన్ సెల్ ఫోన్ సిగ్నళ్లు రావడం కలకలం రేపింది.
పాకిస్తాన్ కు చాలా దూరంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పాకిస్తాన్ సెల్ నెట్ వర్క్ సిగ్నళ్లను తాము గుర్తించామని పర్వతారోహణకు వచ్చిన కొందరు తెలుపడం సంచలనమైంది. ఇక్కడ భారత్ మొబైల్ ఆపరేటర్ల సిగ్నళ్లు ఏవీ అందుబాటులో లేవని.. పాక్ సిగ్నళ్లు మాత్రం పూర్తి స్థాయిలో వస్తున్నాయని వారు తెలిపారు.ఆ సిగ్నళ్ల స్ట్రెంత్ అధికంగా ఉండడంతో వాటంతట అవే పాక్ నెట్ వర్క్ కు మారిపోయాయని.. తమ ఫోన్లలో పాక్ స్తాన్ టైమ్ కనిపించిందని వారు తెలిపారు.
సముద్రమట్టానికి 2600 కి.మీల ఎత్తున కరేరీ సరస్సు వద్ద తాము పాకిస్తాన్ సిగ్నళ్లను గుర్తించామని పర్వతారోహకులు తెలిపారు.పాకిస్తాన్ సరిహద్దుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరంలో కూడా పాక్ సిగ్నళ్లు రావడం భారతీయ భద్రతకు ముప్పు అని కలకలం రేగుతోంది.అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. ఓ దేశంలోని మొబైల్ ఆపరేటర్ల సిగ్నళ్లు సరిహద్దుకు 500 మీటర్లు దాటి వెళ్లకూడదు. కానీ పాక్ సిగ్నళ్లు మాత్రం భారత్ లో ఏకంగా 140 కి.మీల లోపలికి చొచ్చుకురావడం సంచలనమైంది.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రస్తుతం ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉండడంపై భారత నిఘా విభాగం దృష్టి సారించింది. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు సమాచార మార్పిడి కలుగకుండా భారత ప్రభుత్వం సిగ్నల్స్ బ్లాక్ చేస్తుంది. కానీ పాక్ కు చెందిన సెల్ ఫోన్ ఆపరేటర్లు జాంగ్, యూఫోన్ కంపెనీల సిగ్నళ్లు రావడం కలకలం రేపుతోంది.