Begin typing your search above and press return to search.
అరె.. మన సైనికుడు పాక్ చేతికి చిక్కాడెలా?
By: Tupaki Desk | 30 Sep 2016 9:15 AM GMTఅనుకోనిది జరిగిపోయింది. నిన్నటి ఆనందం ఆవిరయ్యే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి మన సైనికులు వెళ్లి.. మెరుపుదాడి చేసిన వేళ.. దేశ వ్యాప్తంగా సంతోషం వెల్లువెరిసిన వేళలో అనుకోని ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే.. ఈ విషయం మీద భిన్న వాదనలు రావటం.. వాస్తవం ఏమిటన్నది స్పష్టత రాని పరిస్థితి. అసలేం జరిగిందన్న విషయాన్ని చూస్తే..
సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా భారత సైనికుల బృందం పాక్ ఆక్రమిక కశ్మీర్ లోకి అడుగు పెట్టి.. అక్కడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. దాదాపు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టటంతో పాటు.. ఉగ్రవాదులకు సాయంగా ఉన్న పాక్ సైనికుల మీద కూడా దాడి జరిగినట్లుగా తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంపై పాక్ వాదన మరోలా ఉంది. లక్షిత దాడుల సందర్భంలో పాక్ సైనికులు భారత సైనికుల మీద దాడులు జరిపారని.. అందులో ఎనిమిది మంది భారత సైనికులు మరణించగా.. ఒకరుప్రాణాలతో చిక్కినట్లుగా చెప్పుకొచ్చింది. అయితే.. ఆ తర్వాత ఆ వాదనను మళ్లీవినిపించలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక భారత సైనికుడ్ని తాము అరెస్ట్ చేసినట్లుగా పాక్ చెబుతోంది. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్ లో భాగంగా వెళ్లిన సైనికుడు కాదని.. నియంత్రణ రేఖను దాటి పాక్ భూభాగంలోకి వచ్చాడని.. అతడిని అరెస్ట్ చేసినట్లుగా పాకిస్థాన్ పేర్కొంది. అయితే.. ఈ ఉదంతంపై పాక్ మీడియాలో వార్త వచ్చింది. దీన్ని తొలుత భారత్ తోసిపుచ్చినప్పటికీ.. తాజాగా మాత్రం ఈ ఉదంతం నిజమన్న మాట కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ స్పష్టం చేయటం కనిపిస్తోంది. భారత సైనికుడు ఒకరు పొరపాటున సరిహద్దు దాటారని.. తనిఖీల నేపథ్యంలో ఇలాంటివి ఇరుదేశాల సైనికులు అప్పుడప్పడు జరుగుతుంటాయని.. పొరపాటున సరిహద్దులు దాటి తిరిగి రావటం మామూలేనని భారత సైనికాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజ్ నాథ్ మాత్రం పాక్ అదుపులో మన సైనికుడు ఒకరు ఉన్నారని.. అతడ్ని వదిలిపెట్టేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న వేళ.. అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సదరు సైనికుడు అంత పొరపాటు ఎలా చేశారన్నది ఒక ప్రశ్న అయితే.. పాక్ చెరలో ఉన్న సైనికులు ఇప్పుడెన్ని కష్టాల్ని అనుభవిస్తున్నాడన్నది సందేహంగా మారిన పరిస్థితి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/