Begin typing your search above and press return to search.

ఆ పాక్ బౌలర్ ఎత్తు 7.6 .. బాల్ వేస్తే బ్యాట్స్ ‌మెన్లకు చుక్కలే !

By:  Tupaki Desk   |   9 Oct 2020 11:30 PM GMT
ఆ పాక్ బౌలర్ ఎత్తు 7.6 .. బాల్ వేస్తే బ్యాట్స్ ‌మెన్లకు చుక్కలే !
X
సాధరణంగా చాలామంది మనుషులు ఐదు నుండి ఆరు అడుగుల మధ్యలో ఎత్తు ఉంటారు. అంతకంటే ఒకటి , రెండు ఇంచులు ఎక్కువ తక్కువ ఉంటారు. కానీ , ఏకంగా 7 అడుగుల 6 అంగుళాలు అంటే ఎలాంటివారైనా కూడా అతని ముందు నిలబడితే చిన్నపిల్లాడిగా మారాల్సిందే. అయిన అంత ఎత్తు ఉన్న మనిషి ఎక్కడ ఉంటాడులే అనుకుంటున్నారా ? పొరపాటే , 7 అడుగుల 6 అంగుళాలు ఎత్తు ఉన్న మనిషి ఉన్నాడు. అతను సాధారణ మనిషి కాదు .. ఒక క్రికెటర్. అతని పేరు ముదస్సర్ గుజ్జర్. వయస్సు 21 సంవత్సరాలు. పాకిస్తాన్‌కు చెందిన అప్ కమింగ్ పేస్ బౌలర్. లాహోర్‌కు చెందిన గజ్జర్.. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు కూడా. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల కోసం లాహోర్ ఖలందర్స్ టీమ్ అతణ్ని తీసుకుంది.

పాకిస్తాన్‌కే చెందిన ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ ఎత్తను అతను డామినేట్ చేశాడు. ఇర్ఫాన్ ఎత్తు 7 అడుగుల ఒక్క అంగుళం. ముదస్సర్ గుజ్జర్ హైట్, అతని కంటే ఇంకో అయిదు అంగుళాలు ఎక్కువే. లాహోర్ ఖలందర్స్ జట్టుకు ఎంపికైన గుజ్జర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌ లో సక్సెస్ అయితే, ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశం ఉండదు. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తుంది. అతడు జాతీయ జట్టుకి ఎంపికైతే .. ఒకవేల బౌలింగ్ వేస్తే బ్యాట్స్ ‌మెన్లకు చుక్కలే. అతని తల్లిదండ్రుల ఎత్తు సాధారణమే. తండ్రి హషీమ్ మొహమ్మద్ హైట్ 5 అడుగుల ఆరు అంగుళాలు. తల్లి పర్వీన్ ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. వారికి భిన్నంగా గుజ్జర్ హైట్ ఇంతెత్తు పెరిగాడు.

గుజ్జర్ కు స్కూల్ డేస్ నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది, ఫాస్ట్ బౌలింగ్ చేసే వాడు. కాలేజ్ దశకు వచ్చే సరికి ఫాస్ట్ బౌలింగ్‌ లో మెళకువలను నేర్చుకున్నానని, అంతర్ కళాశాల టోర్నమెంట్లలో ఆడేవాడినని చెప్పాడు. తనను మరింత ప్రోత్సహించడానికి లాహోర్ ఖలందర్స్ టీమ్ ముందుకొచ్చిందని, పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లతో తాను మరింత రాటుదేలుతాననీ అన్నాడు. పాకిస్తాన్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తానని ముదస్సర్ గుజ్జర్ చెప్పుకొచ్చాడు.