Begin typing your search above and press return to search.

ఐఎంఎఫ్ కండిషన్లకు తలొగ్గిన పాక్.. ఇక బాదుడే బాదుడు..!

By:  Tupaki Desk   |   12 Feb 2023 6:00 AM GMT
ఐఎంఎఫ్ కండిషన్లకు తలొగ్గిన పాక్.. ఇక బాదుడే బాదుడు..!
X
ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. గత పది రోజులుగా ఐఎంఎఫ్ ప్రతినిధులకు.. పాకిస్థాన్ అధికారులకు మధ్య ఉద్దీపన ప్యాకేజీపై ఎడతెగని చర్చ నడిచింది. తొలుత ఐఎంఎఫ్ కండీషన్లను ఒప్పుకునేందుకు ససేమిరా అన్న పాకిస్తాన్ ఎట్టకేలకు తలవంచక తప్పలేదు. దీంతో ఐఎంఎఫ్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది.

విదేశీ నిల్వలు అడుగంటిన సమయంలో ఐఎంఎఫ్ అందించనున్న భారీ సాయం పాకిస్తాన్ ను తాత్కాలికంగా ఆదుకోనుంది. ఇదే సమయంలో ఐఎంఎఫ్ కండీషన్లకు పాక్ తలొగ్గడంపై ప్రజలపై మరింత భారం పడే అవకాశం కన్పిస్తోంది.

ఈ విషయంపై పాకిస్తాన్ ఆర్థిక మంతరి ఇషాక్ దార్ మాట్లాడుతూ రుణాల మంజూరు కోసం ఐఎంఎఫ్ పలు షరతులను విధించినట్లు తెలిపారు. వీటిపై సోమవారం నుంచి వర్చువల్ విధానంలో చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఈమేరకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇక ఆ తర్వాత జరిగిన కేబినెట్ కు చెందిన ఎకనమిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భేటిలో కొన్ని పన్నుల విధింపుపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

విద్యుత్ పై ఒక్కో యూనిట్ కు రూ.3.21 వరకు త్రైమాసిక సర్దుబాటుతో పాటు స్పెషల్ ఫైన్సాన్సింగ్ ఛార్జి కింద రూ.3.99 చొప్పున ఏడాది పాటు వసూలు చేయనున్నారు. ఇంధన సర్దుబాటు కింద ఒక్కో యూనిట్ కు రూ.4 చొప్పున మూడు నెలల పాటు రికవరీ చేసేందుకు నిర్ణయించారు.

ఐఎంఎఫ్ షరతుల మేరకు మార్చి 1 నుంచి జీరో రేటింగ్ కలిగిన పరిశ్రమలకు రాయితీలు.. కిసాన్ ప్యాకేజీలను సైతం ఎత్తివేయాలని క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. జనరల్ సేల్స్ ట్యాక్స్ సైతం ఒక శాతం మేరకు పెంచనున్నారు. దీంతో పాకిస్తాన్లో విద్యుత్ ఛార్జీలతో పాటు కరెంట్ ఛార్జీలు మరింత భారంగా మారనున్నాయి.

ఇప్పటికే పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు తాజాగా పెరుగనున్న పన్నులు ప్రజలను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.