Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌లో పొలిటిక‌ల్ హీట్‌.. ఇమ్రాన్ పార్టీపై నిషేధం?!

By:  Tupaki Desk   |   25 May 2023 11:00 PM GMT
పాకిస్థాన్‌లో పొలిటిక‌ల్ హీట్‌.. ఇమ్రాన్ పార్టీపై నిషేధం?!
X
పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. మాజీ క్రికెట‌ర్‌, ఆ దేశ మాజీ ప్ర‌ధాని పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ వ్య‌వ‌స్తాప‌కుడు ఇమ్రాన్ ఖాన్‌కు మ‌రింత సెగ పెరిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. జైలుకు పెట్ట‌డం.. పోలీసులు ఆయ‌న మెడ ప‌ట్టుకుని అదిలించ డం.. సుప్రీంకోర్టు సీరియ‌స్ కావ‌డం.. వర‌కు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. మొత్తానికి ఆయ నకు సుప్రీం కోర్టు జోక్యంతో కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

అయితే.. ఇది జ‌రిగి రెండు రోజులు కూడా పూర్తి కాకుండానే.. అధికార ప‌క్షం మ‌రింత దూకుడు పెంచింది. ఏకంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధించేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఒక వైపు ప్ర‌భుత్వ తీరుపై ఇమ్రాన్ ఖాన్‌.. తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుతున్నారు. త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేసిన ప్ర‌భుత్వంపైప్ర‌జ‌ల్లోకి వెళ్తాన‌ని చెప్పారు. దీంతో ఆయ‌న‌కు సింప‌తీ ప్ర‌మాణాలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన ప్ర‌భుత్వం.. అస‌లు ఇమ్రాన్ ఉనికిపైనే దెబ్బ‌కొట్టే చ‌ర్య‌ల‌కు రంగం రెడీ చేసింది.

ఇమ్రాన్ పార్టీ ర‌ద్దు విష‌యాన్ని పాక్ రక్ష‌ణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సూచ‌న ప్రాయంగా చెప్పుకొచ్చారు. ఇమ్రాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆయ‌న పార్టీ పీటీఐ అభిమానులు, కార్యకర్తలు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాక, దేశ మిలటరీ స్థావరాలపై దాడులకు తెగబడిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పీటీఐని నిషేధించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే దీనిపై సమీక్ష జరుగుతున్నదన్నారు.

ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదం కోసం పంపామని, అనంతరం పీటీఐ నిషేధంపై ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ త‌ర‌చూ దేశ రక్ష‌ణశాఖ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, దేశ సైన్య విభాగాన్ని శ‌త్రువుగా భావిస్తున్నార‌ని ఆరోపించారు. పాక్ సైన్యం కార‌ణంగానే ఇమ్రాన్ రాజ‌కీయా ల్లో కాలుమోపార‌ని, ఇప్పుడు దీనిని మ‌ర‌చిపోయి ఆయ‌న సైన్యాన్ని త‌ప్పుప‌ట్ట‌డం స‌రికాద‌న్నారు. దీంతో ఇమ్రాన్ పార్టీపై నిషేధం విధించే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.